Begin typing your search above and press return to search.

ఈడీ ముందుకు ఐశ్వర్య: ఏం చెప్పబోతుందంటే..?

By:  Tupaki Desk   |   20 Dec 2021 2:29 PM IST
ఈడీ ముందుకు ఐశ్వర్య: ఏం చెప్పబోతుందంటే..?
X
బాలీవుడ్ ఒకప్పటి అందాల తార ఐశ్వర్యారాయ్ కు ఈడీ సమన్లు పంపింది. ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా సోమవారం తెలిపిపంది. విచారణ కోసం ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసుకున్న ఈడీ ఆ తరువాత ఐశ్వర్యరాయ్ కు సమన్లు పంపించినట్లుసమాచారం. ఫనామా పేపర్స్ కేసులో ఐశ్వర్యరాయ్ ని విచారించే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈడీ ఎదుట హాజరయ్యారు. కొన్ని ముఖ్యమైన పేపర్లను ఈడీకి సమర్పించారు. తాజాగా ఐశ్వర్యరాయ్ ను కూడా హాజరు కావాల్సిందిగా సమన్లు పంపడం ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఫనామా కేసులో 500 మంది ప్రముఖులతో సంబంధం ఉన్నట్లు అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ప్రముఖంగా బచ్చన్ ఫ్యామిలీకి చెందిన వారున్నారు. అయతే ఇప్పటికే అమితాబ్ బచ్చన్ హాజరై పలు విషయాలను చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఏవిధంగా స్పందిస్తారోనని ఎదురుచూస్తున్నారు. ట్యాక్స్ కట్టకపోవడం వల్లే ఈ విచారణను ఐశ్వర్యరాయ్ ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అయితే విచారణ పూర్తయిన తరువాత అసలు విషయం బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.

గతంలో ఫనామా పేపర్స్ పలు సంచలన విషయాలను బయటపెట్టింది. దేశవ్యాపత్ంగా ఉన్న సెలబ్రెటీలు, సంపన్నుల వ్యక్తిగత ఖాతా వివరాలను బయటపెట్టింది. కొందరు అక్రమంగా విదేశాల్లో కంపెనీలు నెలకొల్పారని, అందుకు సంబంధించిన టాక్స్ ను ప్రభుత్వానికి చెల్లించలేదని తెలిపింది. ఇందులో భాగంగా అమితాబ్ బచ్చన్ కుటుంబం గురించి కూడా బయటపెట్టింది.

2016లో పనామా నుంచి ఆపరేట్ అయ్యే ఓ లా కంపెనికి సంబంధించి రూ.11.5 కోట్లు మేరా టాక్స్ డాక్యుమెంట్లు లీకయ్యాయి. ఇందులో అమితాబ్ బచ్చన్ నాలుగు కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నట్లు తెలిపింది. వీటిలో బహామాస్, వర్జిన్ ఐలాండ్లో మూడు ఉండగా.. మరొకటి తెలియాల్సి ఉంది.

అలాగే 1993లో వీటిని స్థాపించగా వాటికి సంబంధించిన మూలధనం 5 వేల నుంచి 50 వేల డాలర్లుగా మారిందని నివేదిక తెలిపింది. ఇన్వెస్టిమెంట్ తక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారం మాత్రం కోట్లలో ఉందని, అదంతా ఈ కంపెనీల ద్వారా సాగిందని తేల్చారు. కాగా ఐశ్వర్యరాయ్ పై మూడింటిలో ఓ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు.

అయితే ఆ తరువాత ఆమె షేర్ హోల్డర్గా మాత్రమే ఉన్నట్లు డిక్లేర్ చేశారు. అయితే ఈడీ ముందుకు హాజరయ్యే ఐశ్వర్య ఎలాంటి సమాధానం ఇస్తుందో..? ఆ వివరాలకు ఈడీ సంతృప్తి చెందుతుందా..? అనేది కీలకంగా మారింది.