Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 15 తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   8 April 2020 2:30 AM GMT
ఏప్రిల్ 15 తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా?
X
ఏప్రిల్ 14తో లాక్ డౌన్ దాదాపుగా ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సంకేతాలు పంపుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్నా...ఇప్పటికైతే కొనసాగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు, లాక్ డౌన్ ఎత్తివేస్తారని బలంగా నమ్ముతున్న కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు ఇప్పటికే టికెట్ల బుకింగ్ ఓపెన్ చేశాయి. అంతేకాదు, టికెట్లు బుక్ చేసుకోవాలంటూ ప్రమోషన్ కూడా మొదలుపెట్టాయి. దీంతో, చాలామంది తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వారు...తమ తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు టికెట్స్ కన్ ఫర్మ్ చేసుకున్నారు. అయితే, వీరందరికీ ఎయిర్ లైన్స్ కొత్త నిబంధన షాకిస్తోంది. ఒక వేళ లాక్ డౌన్ కంటిన్యూ అయి...టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే...ఆ డబ్బు వెంటనే తిరిగి రాదనే నిబంధన ప్యాసింజర్లకు షాకిచ్చింది.

లాక్ డౌన్ పై, విమాన టికెట్లపై కేంద్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అందుకే, ఎయిరిండియా బుకింగ్ ఓపెన్ చేయలేదు. కానీ, కొన్ని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ మాత్రం సిట్యువేషన్ ను క్యాష్ చేసుకోవాలన్న కక్కుర్తితో బుకింగ్స్ ప్రారంభించాయి. చాలామంది ఎయిర్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు.

అయితే, కొత్త క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం... విమాన సర్వీసులు ప్రారంభం కాకుంటే... టికెట్ డబ్బులు వెంటనే రిఫండ్ చేయరు. ఆ డబ్బును క్రెడిట్ కింద హోల్డ్ లో ఉంచుతారు. ఏడాది సమయంలోపు సదరు ప్రయాణికుడు ఎప్పుడైనా ఆ క్రెడిట్ డబ్బుతో మరో టికెట్ బుక్ చేసుకొని ప్రయాణించవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారుని ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ సూచనలు లేకుండా ఎయిర్ లైన్స్ కంపెనీలు బుకింగ్స్ ప్రారంభించడం సరికాదని, దీని వల్ల ప్యాసెంజర్లు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు...బుకింగ్ డబ్బు వెనక్కి రాకపోతే మరింత ఇబ్బంది పడతారని చెప్పారు.