Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌, అమిత్ షాకు త‌ప్పిన పెను ప్ర‌మాదం

By:  Tupaki Desk   |   15 March 2017 2:12 PM GMT
వెంక‌య్య‌, అమిత్ షాకు త‌ప్పిన పెను ప్ర‌మాదం
X
బీజేపీ జాతీయ‌ అధ్య‌క్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది. దీంతో ఆ ఇద్ద‌రూ ప్ర‌యాణిస్తున్న ప్లేన్ మార్గ‌మ‌ధ్యలోనే వెనుదిరిగింది. మ‌ణిపూర్ సీఎంగా బీరెన్‌ సింగ్ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మానికి వెళ్తున్న సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

త‌మ పార్టీ నేత ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు అమిత్ షా, వెంక‌య్య‌నాయుడులు ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరారు. ఉద‌యం 9.39 నిమిషాల‌కు ఢిల్లీ విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక ఎయిర్‌ క్రాఫ్ట్ బ‌య‌లుదేరింది. ఆ విమానంలో ఈ ఇద్ద‌రితో పాటు మ‌రో ముగ్గురు కూడా ఉన్నారు. ఏఆర్ ఎయిర్‌ వేస్‌ కు చెందిన ఫాల్క‌న్‌200 బిజినెస్ మాడ‌ల్ విమానంలో ఈ ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు బ‌య‌లుదేరారు. అయితే ప్లేన్‌ లో సాంకేతిక స‌మ‌స్య ఉత్ప‌న్నం కావ‌డంతో తిరిగి అది 10.17 నిమిషాల‌కు ఢిల్లీ విమానాశ్ర‌యానికి చేరుకుంది. మార్గ‌మ‌ధ్యలోనే ఇంజిన్‌ లో లోపం త‌లెత్తింది. దీంతో దాని పైలెట్ విమానాన్ని వెన‌క్కి తీసుకెళ్లాడు.

మరోవైపు ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ విమానం బార్మర్ జిల్లా శివ్‌ కర్ కుద్లా గ్రామంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఇద్దరు ఫైలట్లు (రెండు ఇంజిన్లు కలిగిన)సుఖోయ్-30ఎంకేఐ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో గాయాలైన నారాయణ్ రామ్ అనే వ్యక్తి సహా అతని కోడలు, 14ఏళ్ల బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్సనందించామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ ఓఝూ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/