Begin typing your search above and press return to search.
దీపావళి వేళ.. కాలుష్యం పాట మొదలెట్టేశారుగా?
By: Tupaki Desk | 9 Nov 2020 9:45 AM GMTకాలుష్యం అన్నంతనే హిందువుల పండుగలే ఎందుకు గుర్తుకు వస్తుంటాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అదే పనిగా కాలుష్యం మాట కొన్ని సందర్భాల్లో రావటం..దానిపై తీవ్రమైన చర్చ జరగటం.. పరిమితులు విధించేలా ప్రభుత్వాల్ని ప్రభావితం చేస్తున్నారన్న మాట పెరుగుతోంది. దీనికి తగ్గట్లే.. తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.
కాలుష్యం అంటే.. వినాయకచవితి వేళ వచ్చే జల కాలుష్యం.. దీపావళి నాడు వచ్చే వాయు కాలుష్యం.. సంక్రాంతి వేళ.. పచ్చదనానికి చెక్ చెబుతున్నారంటూ భారీ లెక్చర్లు దంచేస్తుంటారు. అవన్నీ నిజమే అనుకుందాం? నిత్యం.. వెలువడే కాలుష్యం మాటేమిటి? కాలం చెల్లిన వాహనాల విషయంలో ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. వీటి కారణంగా వెలువడే కాలుష్యాన్ని ఎందుకు గుర్తించరు?
అంతేనా.. మిగిలిన మతస్తుల పర్వదినాల సందర్భంగా చోటు చేసుకునే కాలుష్యం గురించి మాట వరసకు ఎందుకు ప్రస్తావించన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మేధావుల పేరుతో లెక్చర్లు దంచుతూ..కాలుష్యం గురించి మాటలు చెప్పేవారంతా మిగిలిన వారి పండుగల సందర్భంగా చోటు చేసుకునే కాలుష్యం గురించి మాట్లాడకపోవటం వెనుక అసలు కారణం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు.. అప్పటికున్న పరిస్థితులకు కాలుష్యం పేరును జత చేసి.. భయపెట్టే ధోరణి పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది.
దీపావళి సందర్భంగా వినియోగించే టపాసులతో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుందని..దానితో కోవిడ్ ముప్పు ఎక్కువ అవుతుందన్న మాట అర్థం లేనిదంటున్నారు. ఎందుకంటే.. కోవిడ్ వేళ.. ఏ కాలుష్యంతోనైనా సమస్యలు వస్తాయి. టపాసుల గురించి ఇంత ఆందోళన చెందేవారు.. ట్రాఫిక్ పెరిగిపోయి.. వాయు కాలుష్యం పెరిగినా..వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది కదా? అలా అని.. వాహనాలపై పరిమితులు పెట్టే వీలుందా? అన్నది ప్రశ్న. తరచూ ఒకరినే టార్గెట్ చేస్తున్నారన్న భావన ప్రజల్లో పెరగటం మంచిది కాదు. ఈ విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.