Begin typing your search above and press return to search.

టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా.. కేంద్రం క్లారిటీ

By:  Tupaki Desk   |   1 Oct 2021 3:30 PM GMT
టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా.. కేంద్రం క్లారిటీ
X
నష్టాల్లో కూరుకుపోయిన ఏయిరిండియాను టాటా గ్రూప్ కైవసం చేసుకుందన్న వార్తలు మీడియాలో ఈ ఉదయం నుంచి గుప్పుమన్నాయి. అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్ కు దక్కిందని ప్రముఖ వాణిజ్య పత్రిక బ్లూమ్ బెర్గ్ తెలిపింది.

ప్రభుత్వ రంగ వైమానిక సంస్థ ‘ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్ మెంట్ కోసం కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కొనుగోలుపై ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించింది.

టాటా సన్స్ , స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ సహా పలువురు బిడ్లు వేశారు. ఈ నేపథ్యంలోనే టాటా సన్స్ బిడ్ గెలుచుకున్నారని ఎయిర్ ఇండియాను వ్యవస్థాపించిన సంస్థనే 68 ఏళ్ల తర్వాత మళ్లీ దాన్ని చేజిక్కించుకుందనే వార్తలు వచ్చాయి.

టాటాసన్స్ ఎయిర్ ఇండియా సొంతం చేసుకుందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని.. టాటా బిడ్ ను మంత్రుల ప్యానెల్ ఆమోదించిందనేది ఈ కథనాల సారాంశం. ఈ కథనాలపై కేంద్రప్రభుత్వం తాజాగా స్పందించింది.

ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్ మెంట్ పై మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్ మెంట్ లో దాఖలైన ఫైనాన్షియల్ బిడ్లను కేంద్రప్రభుత్వం ఆమోదించిందని సూచిస్తూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సంస్థ డిజిన్వెస్ట్ మెంట్ ప్రక్రియలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు తెలియజేస్తామని వివరించింది. డిపమ్ సెక్రెటరీ ట్విట్టర్ హ్యాండిల్ ఈ వివరణ ఇచ్చింది.