Begin typing your search above and press return to search.

విమానంలో ఏసీ ప‌నిచేయ‌క‌పోతే ఏం చేశారంటే

By:  Tupaki Desk   |   3 July 2017 10:25 AM GMT
విమానంలో ఏసీ ప‌నిచేయ‌క‌పోతే ఏం చేశారంటే
X
విమానంలో ఏసీ ప‌నిచేయ‌క‌పోతే ఎలా ఉంటుంది...ఊహించుకునేందుకే షాకింగ్‌ గా ఉంది క‌దా?! అలాంటి షాక్‌ మ‌న‌దేశంలోనే జ‌రిగింది. ఎయిరిండియా విమానంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అయింది. ప‌శ్చిమ‌ బెంగాల్‌ లోని బగ్‌ డోరా నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో ప్రయాణికులకు న్యూస్ పేపర్లే విసనకర్రలు అయ్యాయి.

ఈ విమానం 168 మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నం 1.55 గంటలకు బయల్దేరింది. విమానం బయల్దేరిన 20 నిమిషాల తర్వాత ఏసీ పని చేయడం లేదని ఎయిరిండియా సిబ్బందికి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. కాసేపట్లో ఏసీ పని చేస్తుందని సిబ్బంది స‌ర్దిచెప్పారు. అయితే ఏసీ పని చేయకపోయే సరికి ప్రయాణికులకు ఊపిరి ఆడటం లేదు. దీంతో తమ వద్ద ఉన్న న్యూస్ పేపర్లను విసనకర్రలుగా ఉపయోగించి.. ఉపశమనం పొందారు. కొద్ది మంది ప్రయాణికులు విమానంలో ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ లు ఉపయోగించినప్పటికీ.. అవి కూడా పని చేయలేదని వాపోయారు. ప్రయాణికులు కొందరు ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కూడా ఫలితం లేకపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలలో ప్రయాణికులు పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/