Begin typing your search above and press return to search.

ఫ్లైట్ లో బాత్రూం సెక్స్ చేస్తూ బుక్ అయ్యింది

By:  Tupaki Desk   |   20 Nov 2015 10:30 PM GMT
ఫ్లైట్ లో బాత్రూం సెక్స్ చేస్తూ బుక్ అయ్యింది
X
గాల్లో ఎగురుతున్న విమానంలోని బాత్రూంలో సెక్స్ చేయటం. కాస్త కష్టమైన ఈ వ్యవహారాన్ని ఒక వ్యాపారంగా మార్చుకొన్న ఎయిర్ హోస్టస్ వ్యవహారం తాజాగా బయటకు వచ్చి.. విస్మయపరుస్తోంది. సదరు ఎయిర్ లైన్స్ సంస్థ వివరాలు కానీ.. ఎయిర్ హోస్టస్ డిటైల్స్ బయటకు రాలేదు. కానీ.. మొత్తం విషయం మాత్రం బయటకు పొక్కింది. ప్రస్తుతం ఉద్యోగం పోగొట్టుకున్న ఈ ఎయిర్ హోస్టస్ చేసిన యవ్వారం మాత్రం షాకింగ్ గా ఉంది. ఇలా.. విమానాల్లో దుకాణం పెట్టేసిన అమ్మడు.. రెండేళ్ల వ్యవధిలో దాదాపు రూ.6కోట్ల వరకూ వెనకేసిందట.

మధ్య ఆసియాలోని ఓ ఎయిర్ లైన్స్ లో పని చేసే ఓ ఎయిర్ హోస్టస్ తన అందంతో విమానంలోని ప్రయాణికుల్ని ఆకట్టుకునేదట. లాంగ్ జర్నీలకు డ్యూటీ వేయించుకునే ఈ అమ్మడు ఎక్కువగా.. గల్ఫ్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో ‘సేవ’ చేసేలా షెడ్యూల్ చేయించుకొని విమానం ఎక్కేసేదట. ఎయిర్ హోస్టెస్ గా సేవలు అందిస్తూనే.. తన మాటలతో.. తనకు తగ్గ ప్యాసింజర్ ను సెట్ చేసేదట. అనంతరం బాత్రూంలో సెక్స్ చేసేసి సింఫుల్ గా రూ.లక్ష ఛార్జ్ చేసేదట. ఇలా అమ్మడి వ్యవహారం రెండేళ్లు నిరాటకంగా సాగిపోయింది.

చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. అమ్మడు కోసమే ఫ్లైట్ ఎక్కే పరిస్థితి. విమానం ఎక్కడటం.. ప్రయాణంతో పాటు.. అమ్మడితో పొందును ఎంజాయ్ చేసేసి వెళ్లిపోయేవారట. తాజాగా ఒక ప్యాసింజర్ తో సెక్స్ చేస్తున్న సమయంలో అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా బుక్ చేశారట. ఆపై ఉద్యోగం నుంచి పీకేసి.. పోలీసులకు అప్పగించారట. కక్కుర్తి పనులు చేస్తే ఇలాంటి తిప్పలు తప్పవు మరి.