Begin typing your search above and press return to search.

రావత్ దుర్ఘటనపై నివేదిక విడుదల చేసిన వాయుసేన

By:  Tupaki Desk   |   15 Jan 2022 3:41 AM GMT
రావత్ దుర్ఘటనపై నివేదిక విడుదల చేసిన వాయుసేన
X
తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఘోర దుర్ఘటనగా సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురి కావటం.. అందులో ప్రయాణిస్తున్న వారంతా (14 మంది) దుర్మరణం పాలు కావటం తెలిసిందే. ఈ ప్రమాదానికి కుట్ర.. విద్రోహం లాంటి అంశాలు తెరమీదకు రావటం తెలిసిందే. అయితే... అందులో నిజం లేదంటూ.. ప్రమాదానికి సంబంధించి వివరాలు కొన్ని ఇప్పటికే వెల్లడయ్యాయి. తాజాగా భారత వాయుసేన ఈ దుర్ఘటనకు సంబంధించిన రిపోర్టును అధికారికంగా విడుదల చేసింది. అందులో.. రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దుర్ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని.. సాంకేతిక లోపాలు కూడా కారణం కావని స్పష్టం చేసింది.

ఎయిర్ మార్షల్ మాన్వేంద్రసింగ్ నేత్రత్వంలో త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ విచారణను చేపట్టి.. నివేదికను సిద్ధం చేసింది. అందులోని వివరాల్ని భారత వాయుసేన అధికారికంగా వెల్లడించింది. హెలికాఫ్టర్ డేటా రికార్డర్.. కాక్ పిట్వాయిస్ రికార్డర్ ను విశ్లేషించారు. ప్రమాదం జరగటానికి కారణాల్ని తెలసుకునేందుకు అందుబాటులో ఉన్న సాక్ష్యుల్నిదర్యాప్తు టీం ప్రశ్నించింది. అనంతరం నివేదికను సిద్ధం చేశారు. అందులో పేర్కొన్న అంశాల్నిచూస్తే..

- హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ టీం నివేదికను రూపొందించింది.

- వాతావరణంలో చోటు చేసుకున్న అనుకోని మార్పులతో పైలెట్ అయోమయానికి గురి కావటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది

- ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు. సాంకేతిక లోపాలు కారణం కాదు.

- లోయలోని వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులకారణంగా సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17వీ5 హెలికాఫ్టర్ మేఘాల్లోకి ప్రవేశించింది. అక్కడి పరిస్థితులతో పైలట్ అయోమయానికి గురయ్యారు.

- హెలికాఫ్టర్ మీద నియంత్రణ కోల్పోయాడు.దీంతో.. ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఎలాంటి సాంకేతిక.. యాంత్రిక తప్పిదాలు దొర్లలేదు.