Begin typing your search above and press return to search.
అలా చేస్తే ఆమె ముఖానికి నల్లరంగు పూస్తాడట
By: Tupaki Desk | 29 April 2016 10:55 AM ISTమత విశ్వాసాల్ని ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్త.. భూమాత బ్రిగేడ్ వస్థాపకురాలు తృప్తిదేశాయ్ సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు అనుమతి లేని దేవాలయాల్లోకి మహిళల్ని అనుమతించాలన్న పట్టుదలతో న్యాయస్థానాలకు వెళ్లి మరీ అనుమతులు తీసుకొచ్చారు. తన పోరాటంలో భాగంగా మహారాష్ట్రలోని శనిసింగనాపూర్.. త్రయంబకేశ్వరం గర్భగుడులలో మహిళల్ని అనుమతించేలా చేయటంలో విజయవంతం కావటమే కాదు.. ఆమె స్వయంగా పూజలు కూడా చేశారు.
తాజాగా ఇప్పుడామె కన్ను మహారాష్ట్రలోని హాజీ అలీ దర్గా మీద పడింది. ఈ దర్గాలోకి మహిళల్ని అనుమతించరు. ఈ దర్గాలోకి ప్రవేశించాలన్న పట్టుదలతో తృప్తి ఉన్నారు. ఆమె కానీ దర్గాలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే.. ఆమె ముఖానికి నల్లరంగు పూస్తానని.. ఒకవేళ తనను అరెస్ట్ చేసినా ఈ పని చేసేందుకు వెనుకాడనని ఈ మజ్లిస్ నేత హజీరఫత్ హుస్సేన్ ప్రకటించారు. దర్గాలోకి మహిళలకు అనుమతి వ్యతిరేకమని.. అది సాధ్యం కాదని చెబుతున్నారు. మరోవైపు తృప్తి వాదన వేరుగా ఉంది. ఇప్పటికే తన వాదనకు అనుకూలంగా పెద్ద ఎత్తున మైనార్టీ మహిళలు అండగా ఉన్నారని చెబుతున్నారు. తాజా పరిణామాలతో మహారాష్ట్ర హాట్.. హాట్ వాతావరణం నెలకొంది. తృప్తి దేశాయ్ మాత్రం దర్గాలో ప్రవేశించాలన్న పట్టుదలగా ఉన్నారు. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.