Begin typing your search above and press return to search.

అసదుద్దీన్ మీకు ఆ బిర్యానీ రుచి చూపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

By:  Tupaki Desk   |   24 Nov 2020 11:45 PM IST
అసదుద్దీన్ మీకు ఆ బిర్యానీ రుచి చూపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
X
జీహెచ్ ఎంసి ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీల ప్రధాన నేతలందరూ ప్రచారంలో మునిగి తేలుతుండడం తో ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడి పెంచేస్తున్నారు. టీఆర్ ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఎంఐఎం నేతలు కూడా సంచలన వ్యాఖ్యలతో ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తూ , ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ , టిఆర్ ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై తీవ్ర విమర్శలు చేశారు. అసదుద్దీన్ తప్పుడు ప్రచారం చేశారన్న ఆయన బీజేపీ ఎప్పుడూ తప్పుడు ప్రచారం చేయదని అన్నారు. అసదుద్దీన్ బీజేపీ వాళ్లకు బిర్యానీ తినిపిస్తాడంట.. తాము కూడా అసదుద్దీన్‌ కు బిర్యానీ తినిపిస్తామన్నారు రాజాసింగ్. అంతే గాక, తమ దగ్గర వాల్మీకి సమాజ్ వాల్లు పంది బిర్యానీ బాగా చేస్తారన్నారు.

హిందూ, ముస్లింల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారని, వరద సహాయం ఇవ్వకపోవడంతో ముస్లింలు మీకు ఓటు వేసే పరిస్థితి లేదని ఓవైసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. ముస్లింలే ఈ విషయాన్ని చెబుతున్నారని రాజా సింగ్ తెలిపారు. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని ముస్లింలను విజ్ఞప్తి చేస్తున్నా.. నా అల్లుడు చనిపోవడం కారణంగానే బీజేపీ ప్రచారంలో పాల్గొనలేకపోతున్నా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.