Begin typing your search above and press return to search.

తమిళనాట ఎన్నికల చిత్రాలు బట్టలుతికిన అన్నాడీఎంకే అభ్యర్థి

By:  Tupaki Desk   |   23 March 2021 11:00 PM IST
తమిళనాట ఎన్నికల చిత్రాలు బట్టలుతికిన అన్నాడీఎంకే అభ్యర్థి
X
ఎన్నికల సిత్రాలు మొదలయ్యాయి. ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చిత్రవిచిత్రమైన వేశాలు వేస్తున్నారు. కొన్ని సినిమాల్లో చూపించినట్టు బయట కూడా నేతలు రెచ్చిపోతూ దిగజారుతున్నారు. గత ఎన్నికలను చూస్తే.. ముసలవ్వకు అన్నం తినిపించాడో అభ్యర్థి.. ఓ పిల్లాడి ముడ్డి కడిగాడో మరో అభ్యర్థి.. తాజాగా తమిళనాడులో మరో విచిత్రం చోటుచేసుకుంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన తంగా కతిరావన్ చేసిన పని వార్తల్లో నిలిచింది. వైరల్ అయ్యింది. ఆయన బహిరంగంగా బట్టలు ఉతికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.అంతేకాదు.. తమ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వాషింగ్ మేషిన్ ఇస్తానని.. అమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని హామీ ఇస్తున్నాడు.

తొలిసారి అసెంబ్లీల బరిలోకి దిగిన ఈ నేత ఓ మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించగా.. అక్కడికి వెళ్లి వారి బట్టలు ఉతికి ఓట్లు అభ్యర్థించాడు. పనిలో పనిగా వారి గిన్నెలు కూడా కడిగేశాడు.ఇదంతా కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందడానికి నేతలు పడుతున్న పాట్లు మాత్రమే.. గెలిచాక అటువైపు తిరిగి కూడా చూడరని ప్రజలు ఆడిపోసుకుంటున్నారు..