Begin typing your search above and press return to search.

బట్టతలను చూసి పుట్ బాల్ అని కెమేరా ఎందుకు అనుకుంది?

By:  Tupaki Desk   |   2 Nov 2020 8:45 AM IST
బట్టతలను చూసి పుట్ బాల్ అని కెమేరా ఎందుకు అనుకుంది?
X
టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా.. కొన్నింటి విషయాల్లో మనిషి అవసరం ఎంతన్న విషయాన్ని చాటి చెప్పే ఉదంతం తాజాగా చోటు చేసుకుందని చెప్పాలి. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత నేపథ్యంలో మనుషుల అవసరం కంటే కూడా టెక్నాలజీని నమ్ముకోవటం మంచిదన్న మాట పలువురి నోటి నుంచి రావటం తెలిసిందే. అయితే..ఈ వాదన ఎంత తప్పన్న విషయం తాజాగా తేలింది. ఫుట్ బాల్ మ్యాచ్ లో లైన్ మ్యాన్ బట్టతలను పుట్ బాల్ గా కెమేరా ఫీల్ కావటం.. మ్యాచ్ ను చూస్తున్న అభిమానులకు శాపంగా మారింది. ఇంతకూ అలా ఎలా జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. టెక్నాలజీతో వసతులే కాదు.. తిప్పలు కూడా ఉంటాయన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకూ జరిగిందేమంటే?

స్కాట్లాండ్ లో ఒక ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. అందివచ్చిన సాంకేతిక ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆధారంగా కెమేరాలను అమర్చారు. అంటే కెమేరా మెన్లతో సంబంధం లేకుండా.. కెమేరాలు దానంతట అదే.. బాల్ నుచూపించే వీలుంది. అయితే.. ఇక్కడో ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. కెమేరామెన్లు లేని కెమేరాలు.. వాటికి ఇచ్చిన ప్రోగ్రాం ఆధారంగా కదిలే లైన్ మ్యాన్ కు బట్టతల ఉండటం.. అతడు తరచూ తిరుగుతూ ఉండటంతో.. ఏఐ టెక్నాలజీ బంతిని బట్టతలగా భ్రమించింది. అంతే.. కెమేరా కన్ను మొత్తం లైన్ మ్యాన్ బట్టతల మీదనే ఫోకస్ చేసింది. దీంతో.. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న వారికి జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు. ఎందుకంటే.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటే.. దాన్ని వదిలేసి.. అవసరం లేకున్నా లైన్ మ్యాన్ ను అదే పనిగా చేపించటంపై చిరాకు వ్యక్తమైంది.

చివరకు జరిగిన పొరపాటుఏమిటో బయటకు వచ్చింది. దీంతో అప్పటివరకు చిరాకు పడినోళ్లు సైతం నవ్వుకోవటం మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్నప్పుడు మనిషికి టెక్నాలజీ ఎప్పుడూ ప్రత్యామ్నాయం కానే కాదన్న నిజం అర్థం కాక మానదు. ఏఐ కెమేరా చేసిన ఘన కార్యాన్ని కామెడీ రైటర్ జేమ్స్ ఫెల్డన్ సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అసలేం జరిగిందో అర్థం కావటమే కాదు.. ఈ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది.