Begin typing your search above and press return to search.
ఐటీ వ్యూహానికి చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి
By: Tupaki Desk | 7 March 2020 11:27 AM ISTహవాలా డబ్బు తరలింపు కేసు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పలు అక్రమాలకు తెరలేపాడు. ఈ సందర్భంగా అప్పట్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇతర పార్టీలకు భారీగా డబ్బులు సర్దుబాటు చేశాడని తెలుస్తోంది. ఈ విషయం అతడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ చౌదరి నివాసం లో చేసిన తనిఖీల్లో బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ ఐటీ సోదాల్లో దొరికిన డైరీలో కీలకంగా మారింది. దాన్ననుసరించే ఇఫ్పుడు సోనియాగాంధీ ఆంతరంగికుడు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు ఐటీ నోటీసులు అందించింది. గతంలో రెండుసార్లు అందించగా తాజాగా మూడోసారి నోటీసులు అందించడంతో ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో త్వరలోనే చంద్రబాబుకు నోటీసులు అందించే అవకాశం కూడా ఉంది.
అహ్మద్ పటేల్ విరాళంగా సేకరించిన రూ.550 కోట్లకు లెక్కలు చెప్పాల్సిందేనని ఐటీ శాఖ వివరణ కోరుతూ ఈ మేరకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వరుస నోటీసులు అందించింది. హవాలా వ్యవహారాన్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SIFO) తీవ్రంగా పరిగణిస్తోంది. వాస్తవంగా ఆదాయపు పన్ను(ఐటీ) చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు రూ.2,000 వరకూ విరాళాలను నగదు రూపంలో తీసుకోవాలి. అంతకంటే అధిక మొత్తాన్ని విరాళంగా స్వీకరించాల్సి వస్తే చెక్ రూపంలో, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తీసుకోవాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అహ్మద్ పటేల్‌కు హవాలా మార్గంలో రూ.550 కోట్లను విరాళంగా అందించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ సోదాలు జరిపిన సమయంలో మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో లభించిన డైరీలు, డాక్యుమెంట్ల ద్వారా ఐటీ శాఖ గుర్తించింది.
ఈ సందర్భంగా మొదట డబ్బులు అందుకున్న అహ్మద్ పటేల్ ను విచారణకు పిలిచారు. ఫిబ్రవరి 11న అహ్మద్ పటేల్‌కు నోటీసులు జారీ చేయగా అనారోగ్యంతో విచారణకు హాజరు కాలేదు. రెండోసారి ఫిబ్రవరి 18న అందించిన నోటీసుకూ ఆయన స్పందించ లేదు. దీంతో తీవ్రంగా పరిగణించిన ఐటీ మార్చి 5వ తేదీన మూడోసారి నోటీసు జారీ చేసి విచారణకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ హెచ్చరించింది. విచారణకు హాజరైతే అహ్మద్ పటేల్‌ను విచారించి ఆ తదుపరి ఆ నిధులు అందించిన చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దీంతోనే ప్రతిపక్ష పార్టీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. విచారణ లో వాస్తవాలు వెల్లడైతే అహ్మద్ పటేల్ తో పాటు చంద్రబాబు జైలుకెళ్లే అవకాశం కూడా ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.