Begin typing your search above and press return to search.

హాంకాంగ్ చేగువేరా...ఆగ్నెస్ చౌ

By:  Tupaki Desk   |   4 Dec 2020 12:30 AM GMT
హాంకాంగ్ చేగువేరా...ఆగ్నెస్ చౌ
X
హాంకాంగ్ లో పుట్టిపెరిగిన ఓ 24 ఏళ్ల యువతిని ఆ దేశ ప్రజలు దేవత అని కొనియాడుతున్నారు..... ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల పేర్లతో బీబీసీ రూపొందించిన ‘100 విమెన్’ జాబితాలో ఆ యువతికి చోటు దక్కింది...ఆ సాధారణ యువతిని అణిచివేయాలని ప్రభుత్వం వందలాదిమంది పోలీసులను మోహరించింది....ఇంతకీ ఆ 24 ఏళ్ల యువతి ఏం చేసింది? ఎందుకు ఆమెకు ఇంత గుర్తింపు వచ్చింది? హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారిణి ‘‘ఆగ్నెస్ చౌ’’ గురించి తెలియనివారుండరు. ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న చౌను అక్కడి యువత హీరో అని పిలుస్తుంటారు. చైనా కాల్పనిక హీరోయిన్ ములాన్‌తో చౌను పోల్చిన కొందరు ఆమెను 'ప్రజాస్వామ్యానికి దేవత' అని అంటున్నారు. హాంకాంగ్ చేగువేరా అని చౌను నెటిజన్లు పొగుడుతున్నారు.

ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన చౌను హాంకాంగ్ ప్రజలు ప్రజాస్వామ్య దేవత అని అభివర్ణిస్తారు. 2014లో అంబ్రెల్లా ఉద్యమంలో చౌ కీలక వ్యక్తి. సార్వత్రిక ఓటు హక్కును డిమాండ్ చేసిన ఉద్యమకారుల్లో ఒకరైన చౌ....ఆ తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమ సంస్థ 'డెమోసిస్టో' ని ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా చట్టాన్ని అమలులోకి తెచ్చిన రోజే ఈ సంస్థపై చైనా, హాంకాంగ్ అధికారులు నిషేధం విధించారు. జాతీయ భద్రతా చట్టానికి చౌతోపాటు మరికొందరు వ్యతిరేకంగా పోరాడారు. ఆ చట్టం వల్ల వేధింపులు, వాక్‌ స్వాతంత్రంపై నియంత్రణ పెరుగుతాయని, నిరసన కూడా తెలియజేయడం కుదరదని చౌ అంటున్నారు. చాలామంది ఉద్యమకారులు విదేశాలకు వెళ్లిపోయారు. కానీ, చౌ మాత్రం హాంకాంగ్ విడిచి వెళ్లబోనని అంటున్నారు. విదేశీ శక్తులతో చౌ చేతులు కలిపారని అధికారులు ఆరోపిస్తూ ఇటీవల ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులోె దోషిగా తేలితే చౌకు యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది.