Begin typing your search above and press return to search.

మళ్లీ నేనే.. ఎనీ డౌట్స్‌: మోదీ

By:  Tupaki Desk   |   3 Feb 2019 5:25 PM IST
మళ్లీ నేనే.. ఎనీ డౌట్స్‌: మోదీ
X
ఎన్నికల జిమ్మిక్కులు చేయడంలో ప్రధాని మోదీని మించినవారు ఇండియాలోనే లేరు. అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు అస్సలు అక్కర్లేదు. ఇక మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో కూడా మోదీకి బాగా తెలుసు. అయితే ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత మీడియాను వాడినా.. గతంలో పోలిస్తే మోదీపై జనాల్లో కాస్త నెగిటివ్‌ ఫీలింగ్‌ అయితే వచ్చేసింది. దీంతో.. ఇప్పుడు ఓటర్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిన్నటికి నిన్న బడ్జెట్‌ లో తాయులాల్ని అన్ని వర్గాల వారికి అద్భుతంగా ప్రకటించారు. అమలు జరుగుతాయా అనే విషయం పక్కనపెడితే... 2009 బడ్జెట్‌ చాలామందికి తెగ నచ్చేసింది.

తాయిలాలు అయిపోయాయి. ఇప్పుడు ఓటర్లతో మైండ్‌ గేమ్‌ మొదలుపెట్టారు. మైండ్‌ గేమ్‌ లో కూడా మోదీ మాస్టర్‌. తమ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏం చేసిందో చెప్తూ.. మళ్లీ వచ్చేది కూడా నేనే అంటూ సగర్వంగా ప్రకటించేశారు. జమ్మూలో జరిగిన కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. అక్కడ బహిరంగ సభల్లో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని.. తాను మరోసారి ప్రధాని కాబోతున్నాని చెప్పారు మోదీ. ఇప్పుడు చేసిన శంకుస్థాపనలు అన్ని పూర్తి అయ్యాక వాటి ప్రారంభోత్సవాలు కూడా తానే చేస్తానని ప్రకటించారు. చెప్పాలంటే ఇది ఒక క్లియర్‌ మైండ్‌ గేమ్‌. జనాన్ని ప్రభావితం చేసి.. మళ్లీ మోదీయే వస్తున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో క్రియేట్‌ చేయడం. ప్రస్తుతం మోదీ అదే పనిలో ఉన్నారు. ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు.