Begin typing your search above and press return to search.
ఈ వీడియోను చూశాక మోడీపై ‘ఫీలింగ్’ మారొచ్చు
By: Tupaki Desk | 18 Dec 2020 9:12 AM ISTఇది డిజిటల్ కాలం. దేన్ని ఎక్కువ కాలం దాచలేం. ఉన్నది ఉన్నట్లు బయటకు వచ్చేస్తుంది. ప్రపంచం మొత్తం చూసేసే పరిస్థితి. ప్రధాని మోడీ అన్నంతనే.. ఆయనో పెద్ద వ్యక్తిత్వ వికాసవేత్తగా.. రూల్ మాస్టర్ గా.. ఆయనలాంటి దయార్థ్ర మనసు మరెవరికీ లేదన్నట్లుగా మోడీ ఫాలోయర్స్ ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూశాక మాత్రం.. అలా చేయటానికి మనసు ఏ మాత్రం ఒప్పుకోదని చెప్పాలి. దేశంలోని అత్యున్నత స్థానాల్లో ఉన్న చాలామంది ప్రముఖులు.. ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి అస్సలు ఇష్టపడరు.
ఆ కోవలోకే వస్తారు ప్రధాని మోడీ. తాజాగా ఆయన ఒక ఎగ్జిబిషన్ కు వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో.. ఒక స్టాల్ వద్దనున్న వస్త్రాల్ని ప్రధాని మోడీ పరిశీలిస్తుంటారు. ఇంతలో స్టాల్ ఏర్పాటు చేసిన వ్యక్తి ప్రధానికి మాస్కు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వద్దని వారిస్తారు. మోడీ భావనను అర్థం చేసుకోక.. ఆయన చేతికి ఇస్తే.. తిరిగి ఇచ్చేస్తారు. అయినప్పటికీ.. మళ్లీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. వద్దనటం కనిపిస్తుంది.
ఈ వీడియో చివర్లో ఆయన చేతులు ఊపిన తీరు.. ఆ సందర్భంగా ముఖంలో ఉన్న భావాలు కాస్త భిన్నంగా కనిపించక మానదు. మనకు తెలిసిన మోడీకి..ఈ వీడియోలోని మోడీ బిహేవియర్ కు కాస్త తేడా కొట్టేసే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖానికి మాస్కు తప్పనిసరి. ఆ విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నట్లు?
తన ముఖానికి మాస్కు లేనప్పుడు.. ఆ విషయాన్ని గుర్తించి ఇచ్చినప్పుడు ఆయన ఎందుకలా వ్యవహరించినట్లు? అన్నది ప్రశ్న. ఇక.. వీడియోను బీజేపీకి ప్రత్యర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసింది. ఈ వీడియోను షేర్ చేసిన ఆ పార్టీ.. ఆయనపై విమర్శనాస్త్రాన్ని సూటిగా సంధించింది. ‘‘దయచేసి మోడీలా ఎవరూ చేయకండి. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి’’ అని ట్వీట్ చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా మోడీ తీరును తప్ప పడుతున్నారు. మోడీ సాబ్ ఏంది.. అప్పుడప్పుడు ఇలా చేసి బుక్ అయిపోతుంటారేంటి?

Wear a mask. Don't be like Modi ji. pic.twitter.com/lPxdTEdZiI
— AAP (@AamAadmiParty) December 17, 2020