Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూశాక పవన్ మీద అభిమానం కొండంతగా పెరుగుతుంది

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:29 AM GMT
ఈ వీడియో చూశాక పవన్ మీద అభిమానం కొండంతగా పెరుగుతుంది
X
ఆదర్శాలు చెప్పటం వేరు. వాటిని చేతల్లో చేసి చూపించటం వేరు. రాజకీయ నాయకుడు కావొచ్చు.. సినీ కథానాయకుడు కావొచ్చు.. మాటలు చెప్పటం చాలా ఈజీ. అందుకు భిన్నంగా చెప్పిన మాటను చేతల్లో చూపించటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే ధోరణి చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాజాగా ఆయన చేసిన పని ఒకటి వీడియోగా షేర్ చేయటంతో పవన్ చేసే పనులు.. ఆయన విజన్ ఎలా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

పవన్ కల్యాణ్ ను అభిమానించి.. ఆరాధించే వారికి కొదవ లేదు. అది అమెరికా అయినా అనకాపల్లి అయితే ఒకేలాంటి అభిమానం బోలెడంత మందిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే.. తనను అభిమానించే వారిని గుండెల్లో గుడి కట్టుకొని పూజించటం.. వారికి ఏమైనా చేయాలన్న తపనతో పని చేయటం లాంటివి అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుది. జనసేన పార్టీలో చేరే క్రియాశీలక సభ్యుల నుంచి రూ.500 మొత్తాన్ని పార్టీకి జమ చేస్తే.. పార్టీ వారిని ఎలా చూసుకుంటుందనన విషయం కళ్లకు కట్టినట్లుగా పేర్కొంటారు.

ఇదిలా ఉంటే.. తమ పార్టీకి సంబంధించిన తాజాగా ఒక పోస్టు పెట్టారు. అందులో రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని చెల్లించిన వైనంతో పాటు.. సదరు బాధిత మహిళ తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఏకరువు పెట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఇలా ఫ్యాన్స్ కోసం తపించే నటులు తక్కువగా ఉన్నారని చెప్పాలి. పెడన నియోజకవర్గంలోని గూడురు మండలం.. కత్తుల వారి పాలెంకు కు సంబంధించిన క్రిష్ణ అనే పార్టీ క్రియాశీలక సభ్యుడితో పాటు.. పన్నమనేని వీర నాగాంజనేయులు మరణించటంతో..

వారిద్దరి కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని అందించేందుకు వీలుగా చెక్కుల పంపిణీ చేపట్టారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు అనుకోని రీతిలో ఏమైనా అయితే రూ.5లక్షలు ఇస్తుండటం గడిచిన కొంతకాలంగా జనసేన చేస్తున్నదే. తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన వేళ..పవన్ పెద్ద మనసు మరోసారి చర్చకు వచ్చింది. రూ.5లక్షల చెక్ తోపాటు.. ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పార్టీ తరఫున కుటుంబానికి నిలబడతామన్న మాటను పవన్ తరఫున.. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వెళ్లి..

బాధితుల్ని స్వయంగా పరామర్శించారు. వారి చేతికి చెక్కును ఇచ్చినప్పుడు.. వారెంతగా కదిలిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లబ్థి పొందిన బాధిత మహిళ.. పవన్ గొప్పతనాన్ని చెప్పిన వైనం చూసినప్పుడు మాత్రం ఒక్క భావం కలుగక మానదు. రాజకీయంగా సవాలచ్చ తేడాలు ఉండొచ్చు కానీ.. పవన్ లాంటి ప్రజా నేతలు మాత్రం చాలా అరుదుగా మాత్రమే ఉంటారని మాత్రమే అర్థమవుతుంది. పార్టీ నిర్మాణం సరిగా లేదని తరచూ విమర్శించే వారు..

అలాంటి వేళలోనూ పార్టీకి కోసం పని చేసేందుకు ఉత్సాహం చూపే వారి విషయాన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ఇలాంటి పార్టీ అధినేతలు మనకున్న పార్టీల్లో ఎంత మంది ఉన్నారో లెక్క చూస్తే.. పవన్ గొప్పతనం అర్థం కాక మానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.