Begin typing your search above and press return to search.

దేవుడు vs కరోనా వైరస్.. నాగబాబు దుమారం

By:  Tupaki Desk   |   6 March 2020 10:32 AM IST
దేవుడు vs కరోనా వైరస్.. నాగబాబు దుమారం
X
ఎన్నికల వేళ హల్ చల్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. ఎన్నికల్లో పవన్ తోపాటు తాను దారుణంగా ఓడడంతో కాస్త సైలెంట్ అయ్యాడు. తన యూట్యూబ్ లో పెద్దగా రాజకీయాల గురించి ప్రస్తావించడం లేదు. టిడిపి, వైయస్ఆర్సి వంటి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసేకోవడం లేదు.. కానీ, తనను బాధపెట్టే విషయాలపై అప్పుడప్పుడు ట్వీట్ చేస్తున్నాడు.

అయితే తాజాగా నాగబాబు పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. అది అతడి ఐడీ నుంచి వచ్చిందో లేదో క్లారిటీగా తెలియదు కానీ.. మరోసారి నాగబాబు ఒక ట్వీట్ తో ముందుకు వచ్చారు. ఆ ట్వీట్ చాలా మందిని ఆశ్చర్య పరిచింది.

హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒక కేసు పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవుణ్ణి విశ్వసించే వారిని తాజాగా నాగబాబు లక్ష్యంగా చేసుకున్నారు. తద్వారా ఆయన 'రామ్ గోపాల్ వర్మ' కోణాన్ని తనలో ఇనుమడించుకున్నారు. వర్మకు దేవుడంటే పడదు. ఇప్పుడు నాగబాబుకు కూడా దేవుడిపై అంత కోపం ఎందుకొచ్చిందో తెలియదు.

నాగబాబు తాజాగా తెలుగు లో ట్వీట్ చేశారు, "దేవుడి భక్తులకు నా చాలెంజ్. ఎక్కువగా సమూహాలుగా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. సో మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మీ ప్రార్థనాలకు గుంపులుగా వెళ్లండి.. పూజలు చేయండి. ప్రసాదాలు తినండం.. అప్పుడు దేవుడు గొప్పనా.. కరోనా వైరస్ గొప్పనా తెలుస్తుంది’ అంటూ భక్తులకు సవాల్ చేశారు.

వాస్తవానికి, నాగబాబు తన ట్వీట్‌ తార్కికంగా ఉంది. నిజాన్ని బయటపెట్టింది. ఈ ట్వీట్ తో తన నాస్తిక విశ్వాసాలను నాగబాబు బయటపెట్టాడు. కానీ ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తీసింది. దేవుడిని కరోనా వైరస్ ను పోల్చి సవాల్ చేసిన తీరు వివాదాస్పదమైంది.