Begin typing your search above and press return to search.

2024 త‌ర్వాత‌.. ఆర్ ఆర్ ఆర్‌కు రాజ్య‌స‌భ సీటు.. ఎవ‌రిస్తారంటే!

By:  Tupaki Desk   |   5 Oct 2021 12:30 AM GMT
2024 త‌ర్వాత‌.. ఆర్ ఆర్ ఆర్‌కు రాజ్య‌స‌భ సీటు.. ఎవ‌రిస్తారంటే!
X
వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. నిత్యం విమ‌ర్శ‌ల‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ ఆపార్టీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి గురి చేసే క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ రాజుఉర‌ఫ్‌.. ఆర్ ఆర్ ఆర్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అంటే 2024 త‌ర్వాత‌.. పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌నున్నారా? ఆయ‌న‌ను ఓ పార్టీ.. రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఆ పార్టీపైనా.. ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా ఆర్ ఆర్ ఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ.. ఆయ‌న సీబీఐ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. దీనిని నాంప‌ల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది అనుకోండి! అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అయితే.. ఇంత‌లా వైసీపీపై ఎందుకు విమ‌ర్శ‌లు.. ఆయ‌న వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యాలు అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఆయ‌న‌ను తెర‌వెనుక న‌డిపిస్తున్న పార్టీ టీడీపీనేన‌ని అంటున్నారు. దాదాపు ఏడాదిన్న‌ర పైగానే ఆయ‌న వైసీపీపై అసంతృప్తి అజెండాతో జెండా ఎగుర‌వేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఆదేశాల మేర‌కు ఆయ‌న న‌డుస్తున్నారం టూ.. త‌ర‌చుగా వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. త‌మ‌కు అనుకూలంగా ఇంత చేసిన‌.. టీడీపీ ఆయ‌న రుణం.. తీర్చుకునే క్ర‌మంలో భాగంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంప‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. మ‌రోప‌క్క‌, ర‌ఘురామ కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తోనూ స‌న్నిహిత సంబంధాలు న‌డుపుతున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మ‌లా సీతారామ‌న్‌(ఏపీలో ఆర్థిక అరాచ‌కంపై లేఖ ఈమెకే రాశాన‌ని చెప్పారు) స‌హా.. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాతోనూ ఆయ‌న మంచిగా మెలుగుతున్నారు. అయితే.. ఇంతగా ర‌ఘురామ బీజేపీతో క‌లిసిమెలిసి ప‌నిచేస్తున్నా.. వారి నుంచి ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఎలాంటి హామీ ల‌భించ‌లేదు. అంతేకాదు.. ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకుంటామ‌ని.. కానీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కానీ.. వారు ఎలాంటి సంకేతాలు ఇవ్వ‌లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న‌పై ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన కేసులు పెండింగులో ఉండ‌డ‌మే.

ఇలాంటి హామీలు ఇవ్వ‌క‌పోయినా.. కేంద్ర నాయక‌త్వం మాత్రం ర‌ఘురామ విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. వైసీపీ ఎంపీలు.. అధిష్టానం కూడా.. ర‌ఘురామ‌ను ఎంపీ ప‌ద‌వి నుంచి డిస్ క్లాలిఫై చేయాలంటూ.. పిటిష‌న్ ఇచ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేదు. దీనిని ప‌క్క‌న పెట్టారన‌ని కూడా వినికిడి. అదేస‌మ‌యంలో వైసీపీ కూడా ఎంపీని పార్టీని నుంచి బ‌హిష్క‌రించ‌లేదు. ఇవ‌న్నీ.. ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్న ప‌రిణామాలుగానే చూడాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు.. ఆర్ ఆర్ ఆర్ వ్య‌వ‌హారం చూసుకుంటే.. వైసీపీపైనా.. సీఎం జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.

ఇవిలావుంటే.. టీడీపీతో ఆయ‌న చ‌నువుగా ఉన్న బీజేపీ నాయ‌కుల‌కు కూడా తెలిసింది. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఆర్ ఆర్ ఆర్ టార్గెట్ చేసుకున్న నాటి నుంచి టీడీపీ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు గా నిలుస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్‌కు సంబంధించి స‌మాచారం.. ఎలా ముందుకు వెళ్లాలి.. ఎలా ఇరుకున పెట్టాలి.. అనే అంశాల‌పై.. కొన్ని అనుకూల మీడియాల ద్వారా.. సాయం చేస్తోంద‌ని.. ఆయా చానెళ్ల ద్వారా.. ర‌ఘురామ నిత్యం రెచ్చిపోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం పార్ల‌మెంటు టికెట్‌ను ఆర్ ఆర్ ఆర్‌కు ఇవ్వాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. ఈ నిర్ణ‌యంపై సొంత పార్టీలో కొంత వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

ఎందుకంటే.. ఇక్క‌డ పార్టీ కోసం ప‌నిచేసిన చాలా మంది క్ష‌త్రియ నాయ‌కులు ఉన్నారు. దీంతో ఇలాంటి వారిని ప‌క్క‌న పెట్టి ఆర్ ఆర్ ఆర్‌ను నెత్తిన పెట్టుకోవ‌డం స‌మంజ‌సం కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఒక‌వేళ లోక్‌స‌భ టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. రాజ్య‌స‌భ‌కు ఖ‌చ్చితంగా పంపిస్తామ‌నే హామీ.. చంద్ర‌బాబు నుంచి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. టీడీపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని.. అప్పుడు ఆర్ ఆర్ ఆర్‌ను గ్యారెంటీగా.. రాజ్య‌స‌భ‌కు పంపుతామ‌ని.. బాబు గ‌ట్టి హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ``ఒక‌వేళ పార్టీ అధికారంలోకి రాక‌పోయినా.. మాకు వ‌చ్చే అసెంబ్లీ సీట్ల ఆధారంగా.. ల‌భించే రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక‌టి ర‌ఘురామ‌కు కేటాయించ‌డం ఖాయం`` అని టీడీపీ నాయ‌కుడు ఒక‌రు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నుంచి వ‌స్తున్న హామీ.. మ‌రి ర‌ఘురామ‌కు నిజంగానే ఈ చాన్స్ ద‌క్కుతుందా? చూడాలి.. ఏం జ‌రుగుతుందో.