Begin typing your search above and press return to search.

ఆఫ్రికా గొరిల్లాకి పొంచి ఉన్న కరోనా ముప్పు !

By:  Tupaki Desk   |   23 March 2020 11:18 AM IST
ఆఫ్రికా గొరిల్లాకి పొంచి ఉన్న కరోనా ముప్పు !
X
కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 14,650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3,37,533కి చేరింది. గడచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 1,450 మంది మృతిచెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత ఆందోళన వ్యక్తం చేసింది. ఇక భారత్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ..396 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కాగా , కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనా లో మాత్రం పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. చైనా లో దాదాపుగా 90 శాతానికి పైగా కరోనా భాదితులు కోలుకున్నారు. కానీ , ఇటలీ లో మాత్రం కరోనా భాదితుల సంఖ్య విపరీతంగా పెరిగి పోతుంది. అలాగే కరోనా వల్ల మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఇటలీ లో భారీగా ఉంది. ఇప్పటికే 5 వేలమంది వరకు చనిపోయారు. దీనితో ఇటలీ మొత్తం కరోనా భయంతో అట్టుడికిపోతోంది.

కాగా, ప్రపంచంలోని మానవాళిని గడగడలాడిస్తోన్న ఈ కరోనా వైరస్ తో ఆఫ్రికా పర్వత ప్రాంత గొరిల్లాకు ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా కాంగో లోని విరుంగ జాతీయ పార్కు జూన్ 1 వరకు పర్యాటకుల సందర్శన ను నిషేదించనుంది. అలాగే కాంగో పొరుగుదేశం అయిన రువాండా కూడా పర్యాటకం , మూడు జాతీయ పార్కుల్లోని పరిశోధక కార్యకలాపాలని మూసేసింది. పర్వత ప్రాంతాలకి చెందిన గొరిల్లాలకి ఊపిరితిత్తుల వ్యాధులకు త్వరగా గురౌతాయని ,సాధారణ జలుబుకి కూడా గొరిల్లా చనిపోయే అవకాశం ఉందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.