Begin typing your search above and press return to search.
రోడ్డు ప్రమాదంలో స్టార్ క్రికెటర్ కన్నుమూత !
By: Tupaki Desk | 6 Oct 2020 5:40 PM ISTఅఫ్గానిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ నజీబ్ రోడ్డు ప్రమాదంలోతుదిశ్వాస విడిచాడు. 29 ఏళ్ల నజీబుల్లా తరకాయ్ గత శుక్రవారం మార్కెట్ కు వెళ్లాడు. ఆ మార్కెట్ లో సరుకులు కొనుక్కుని రోడ్డు దాటుతున్న సమయంలో ఓ ప్యాసింజర్ కారు రయ్యిమంటూ దూసుకొచ్చి నజీబ్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నజీబ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు నజీబ్. నజీబ్ మరణించాడన్న వార్తను అఫ్గన్ క్రికెట్ బోర్డు జీర్ణించులేకపోతున్నది.
డ్యాషింగ్ ఓపెనర్‌తో పాటు ఓ మంచి మనిషిని కోల్పోయామని బాధను వ్యక్తం చేస్తూ అఫ్గన్ క్రికెట్ బోర్డు మరణ వార్తను ధ్రువీకరించింది. 2014లో జింబాబ్వేపై తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన నజీబ్ ఆ తర్వాత అఫ్గన్ టీమ్ లో కీలక ఆటగాడిగా మారాడు. తన క్రికెట్ కెరియర్ లో మొత్తం 24 మ్యాచుల లో 47.20 సగటుతో 2030 పరుగులు చేశాడు.. అయిదు సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు.. ఐర్లాండ్ తో జరిగిన ఓ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన నజీబ్ అందు లో అయిదు పరుగులు చేశాడు. ఇక 12 టీ-20 మ్యాచుల్లో 258 పరుగులు చేశాడు. ఐర్లాండ్ తోనే జరిగిన ఓ టీ -20 మ్యాచ్ లో మెరుపు వేగంతో 90 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.