Begin typing your search above and press return to search.

తల్లితో ఎఫైర్, కూతురుతో పెళ్లి.. అల్లుడిని హత్య చేసిన అత్త

By:  Tupaki Desk   |   29 Oct 2020 3:40 PM IST
తల్లితో ఎఫైర్, కూతురుతో పెళ్లి.. అల్లుడిని హత్య చేసిన అత్త
X
సమాజంలో విలువలు లేకుండా పోతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు వావివరసలు మరిచిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అవి కాపురాలు కూలిపోయేలా చేస్తున్నాయి. అల్లుడితో అంతకుముందే వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త బరితెగించిందే కాకుండా తన అమాయకపు కూతురును అతడికే ఇచ్చి పెళ్లి చేసింది. ఆ అల్లుడు ఊరుకుంటాడా? అటు కూతురును, ఇటు అత్తను వాడేయడం మొదలుపెట్టాడు. ఈ అక్రమ వ్యవహారం తెలిసిన కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఏమైంది ఏమో కానీ.. ఆ అత్త తాజాగా అల్లుడిని హత్య చేసింది.

అల్లుడిని అత్త హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. ఉప్పల్‌లోని రామంతపూర్‌కు చెందిన ఒక మహిళ.. ఒక యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే తన కూతురుకు తను ఎఫైర్ పెట్టుకున్న యువకుడితోనే ఇటీవల వివాహం చేయించింది. ఈ దారుణం జరిగిపోగా.. పెళ్లయిన కూడా అత్తతో వివాహేతర సంబంధాన్ని అల్లుడు మానలేదు.

కొన్ని రోజుల తరువాత అత్తా, అల్లుళ్ల వివాహేతర సంబంధం కూతురుకు తెలిసింది. దీన్ని భరించలేని కూతురు నాలుగు నెలల కిందట మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.

దారుణం ఏంటంటే కూతురు మరణించినా కూడా.. అల్లుడితోనే అత్త అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అయితే నిన్న రాత్రి ఏమైందో కానీ అల్లుడు, అత్త మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఆగ్రహం పట్టలేక అల్లుడిని అత్త హత్య చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ హత్యకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.