Begin typing your search above and press return to search.

హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

By:  Tupaki Desk   |   17 Feb 2021 9:00 PM IST
హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
X
తెలంగాణ హైకోర్టు న్యాయవాది దంపతులను దుండగులు అత్యంత దారుణంగా నరికి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘాతుకం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో న్యాయవాద దంపతులను దుండగులు అతి కిరాతకంగా నరికివేశారు.

హైదరాబాద్ నుంచి మంథని వెళ్తుండగా దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కారులోనే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఈ దాడిలో న్యాయవాదులు వామన్ రావు, భార్య నాగమణిలు అక్కడికక్కడే మృతి చెందారు.కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్న వామన్ రావు తనపై కుంట శ్రీనివాస్, అతడి అనుచరులు దాడి చేసినట్లు స్థానికులకు వెల్లడించినట్లు తెలిసింది.

హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. వామన్ రావు చనిపోతూ స్థానికులకు చెప్పిన విషయాలను వాంగ్మూలంగా స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.కాగా ఆర్థిక లావాదేవీల కారణంగా న్యాయవాది హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.