Begin typing your search above and press return to search.

కొత్తకోణం: హిట్లర్ సూసైడ్ చేసుకోలేదట

By:  Tupaki Desk   |   15 Jan 2017 2:51 PM GMT
కొత్తకోణం: హిట్లర్ సూసైడ్ చేసుకోలేదట
X
చరిత్ర చాలా చిత్రంగా ఉంటుంది. నిజాలుగా చెప్పినవన్నీ నిజాలుగా ఉండవు. అదే సమయంలో అసత్యాలుగా ప్రచారంలో ఉన్నవన్నీ అబద్ధాలు ఎంత మాత్రం కావు. అయితే.. అప్పటికే బలంగా ప్రచారంలో ఉండే చాలా అంశాలు కాలపరీక్షల పుణ్యమా అని అసలు ముచ్చట్లు బయటకు వస్తాయి. ఇలా వచ్చిన అంశాలు సందేహాలు కలిగించటమే కాదు..తార్కికంగా ఆలోచిస్తే ఎంతోకొంత నిజం ఉందన్న భావన కలగటం ఖాయం.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచాన్ని వణికించిన నియంత హిట్లర్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో సంకీర్ణ దళాల చేతిలో ఓటమి పాలైన హిట్లర్.. ఆ అవమాన భారం తట్టుకోలేక.. శత్రుసేనలకు చిక్కటం ఏ మాత్రం ఇష్టం లేక ఆయన బంకర్ లో తనను తానుకాల్చుకొని చనిపోయినట్లుగా చెబుతారు. ఇదే నిజమని చరిత్ర లెక్క తేల్చింది కూడా.

అయితే.. ఈ వాదనలో ఎంతమాత్రం నిజం లేదని చెబుతున్నారు.. సీఐఏ మాజీ అధికారి బాబ్ బేర్, అమెరికా ప్రత్యేక దళాల సార్జెంట్ టిమ్ కెన్నడీలు. బెర్లిన్ బంకర్ లో హిట్లర్ సూసైడ్ వ్యవహారమంతా ఒక కల్పిత నాటకంగా వారు అభివర్ణిస్తున్నారు. హిట్లర్ కేవలం నాటకం ఆడారని.. ఆయన జర్మనీ నుంచి పారిపోయారని వారు చెబుతున్నారు.

అప్పుడెప్పుడో చనిపోయినట్లు చెప్పే హిట్లర్ గురించి కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్న వీరిద్దరిని నమ్మాల్సిన అవసరం ఉందా? అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. వారిద్దరూ అంత చిన్న వ్యక్తులేం కాదు. తీవ్రవాదులకు పెద్దన్న చెప్పుకునే బిన్ లాడెన్.. అబు అల్ జర్కావీలను పట్టుకోవటంలో వీరి పాత్ర ఎంతో ఉంది. మరి.. అలాంటి వ్యక్తులు హిట్లర్ సూసైడ్ గురించి మాట్లాడారంటే అంత చిన్న విషయం కాదన్నది మర్చిపోకూడదు.

వారి వాదన ప్రకారం..హిట్లర్ చనిపోయినట్లుగా చెబుతున్న రోజుకు ఒకరోజు ముందే రహస్య బంకర్ నుంచి విమానంలోఅర్జెంటీనాకు పారిపోయినట్లుగా చెబుతున్నారు. హిట్లర్ చివరగా ఉన్న బెర్లిన్ బంకర్ లోని ఐదో ద్వారం నుంచి ఒక దారి ఓ పెద్ద మైదానానికి దారి తీయటాన్ని వారు చూపిస్తున్నారు. జర్మనీ నుంచి పారిపోయిన హిట్లర్ అర్జెంటీనా వెళ్లారని.. అలా వెళ్లే ముందు డెన్ మార్క్ లో విమానం మారినట్లుగా చెబుతున్నారు.

ఈ సందర్భంగా హిట్లర్ ను చూసినట్లు పలువురు చెప్పినట్లుగా వారు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వేలాది మంది నాజీలు జర్మనీ నుంచి అర్జెంటీనాకు వలస వెళ్లారని.. హిట్లర్ కూడా ఆ క్రమంలోనే వెళ్లినట్లుగా చెబుతున్నారు. మరోవైపు 1945, ఏప్రిల్ 30న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సంకీర్ణ దళాలు ప్రకటించి.. వారి మృతదేహాల్ని దుప్పట్లలో చుట్టి.. ఒక గార్డెన్ లో పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా చెబుతున్నారు. హిట్లర్ అవశేషాలుగా చెబుతున్న ఒక దవడను హిట్లర్ ది చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన పరీక్ష ఒక్కసారి మాత్రమే జరిగిందని.. అందుకే అనుమానించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హిట్లర్ ఆచూకీ గురించి అర్జెంటీనాలో ఉన్న నాజీలు నోరు మెదపటం లేదు. తాజా వాదన పుణ్యమా అని హిట్లర్ ఆత్మహత్య ఎపిసోడ్ మిస్టరీగా మారిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/