Begin typing your search above and press return to search.

పాకిస్థానీల ట్రోలింగ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్

By:  Tupaki Desk   |   17 Aug 2019 5:51 PM IST
పాకిస్థానీల ట్రోలింగ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్
X
పాకిస్థాన్ నుంచి వచ్చి ఇండియాలో స్థిరపడిన సింగర్ అద్నన్ సమీని టార్గెట్ చేసుకుని పాకిస్థానీలు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ ట్రోల్స్ కి అద్నన్ కూడా గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఆగష్టు 15 స్వాంతంత్య్ర‌ దినోత్సవం రోజున అద్నన్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొందరు పాక్ నెటిజన్లు అద్నన్ ట్రోల్స్ వేశారు. సమీ కొన్నాళ్లుగా అద్నన్ ఇండియాలోనే ఉంటున్నారు. ఈయనకి 2016లో భారత్ పౌరసత్వం కూడా వచ్చింది.

ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ పాక్ నెటిజన్ అద్నన్ సమీని 'మీ నాన్న ఎక్కడ పుట్టారు? ఎక్కడ మరణించారు? అంటూ ప్రశ్నించారు. దీనికి సమీ రిప్లై ఇస్తూ... 'మా నాన్న 1942లో ఇండియాలో పుట్టారు, 2009లో ఇండియాలో మరణించారు' అంటూ స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు. ఇంతటితో ఆపకుండా కొందరు కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో అతడిని టార్గెట్ చేశారు.

మరొక ట్రోలర్ స్పందిస్తూ.. ‘అద్నాన్ సమీ నీకు నిజంగా దమ్ముంటే కశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడి.. అపుడు చూడు నీ ఇండియా ఏం చేస్తుందో నీకు తెలుస్తుంది' అంటూ కామెంట్ చేశాడు. దీనికి అద్నన్ సమీ స్పందిస్తూ.. ‘తప్పకుండా... కశ్మీర్ అనేది ఇండియాలో అంతర్భాగమని, మీకు చెందని దాని విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు' అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇక మరొకడు ‘నువ్వు ఇలాంటివాడివి కాబట్టే మేము నిన్ను వదిలించుకున్నామని కామెంట్ చేశాడు. దీనికి సమాధానంగా మీరు వదిలించుకోలేదు..నేనే వచ్చేశానని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. మొత్తానికి అద్నన్ తన కౌంటర్లతో పాకిస్థానీలకు గట్టి బుద్ధి చెప్పారు. ఆయన ఇండియా వారసత్వం తీసుకున్న దగ్గర నుంచి పాక్ నెటిజన్లు ఆయనపై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. వాటిని సమీ తిప్పికొడుతూనే ఉన్నారు.