Begin typing your search above and press return to search.

ఏపీలోని గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవట

By:  Tupaki Desk   |   10 Jun 2016 6:46 AM GMT
ఏపీలోని గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవట
X
మరీ సిత్రం కాకపోతే.. అలాంటి ఛాన్సే ఉండదని మీరు అనుకోవచ్చు. కానీ.. ఇది ముమ్మాటికి నిజం. ప్రైవేటు స్కూళ్లలో సీట్లు దొరక్కపోవటం కామన్. విద్యా సంవత్సరం ప్రారంభం కావటానికి నెలల ముందు నుంచే ఆడ్మిషన్లు పూర్తి అయినట్లుగా బోర్డులు పెట్టేస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థతులు ఉంటాయి. కానీ.. సరిగ్గా పని చేయాలే కానీ.. ప్రైవేటు స్కూళ్లకు మించిన రద్దీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించిందో ప్రభుత్వ పాఠశాల.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని కేఎన్నార్ మున్సిపల్ హైస్కూల్లో చదువుకోవటానికి ఎవరైనా విద్యార్థులు ప్రయత్నిస్తే వారికి సీటు దొరకటం సాధ్యం కాదు.ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఆడ్మిషన్లు లేవంటూ ఆ స్కూల్ ముందు ఫ్లెక్సీ వేలాడదీయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గవర్నమెంట్ స్కూళ్లో సీట్లు లేకపోవటం ఏంటన్న సందేహాలు వద్దని.. ఈ స్కూల్లో విద్యా విధానం బాగుండటం.. ఈ స్కూల్లో చదివే విద్యార్థుల మార్కులు ఎక్కువగా ఉండటంతో పాటు.. నాణ్యమైన విద్యను ఈ స్కూలు సిబ్బంది బోధించటమే ఇంత క్రేజ్ కు కారణంగా చెబుతున్నారు. ఇంగ్లిషు.. తెలుగు మీడియంలలో చెప్పే ఈ స్కూల్లో 7 నుంచి 10 తరగతి వరకు 200 – 220 మంది విద్యార్థులు చదువుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా ఒక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సీట్లు లేవంటూ ఫ్లెక్సీలు పెట్టటం విశేషం. ఈ స్కూల్లో ఏముంది? ఇక్కడ సిబ్బంది ఎలా పని చేస్తున్నారన్న విషయాన్ని ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుంటుంది.