Begin typing your search above and press return to search.

దసరా రోజున జగన్ కు పెద్ద షాక్

By:  Tupaki Desk   |   2 Oct 2015 6:20 AM GMT
దసరా రోజున జగన్ కు పెద్ద షాక్
X
దసరా పండుగ రోజున ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాకే తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అధికార పక్షంలోకి మారటం ఖాయమని తేలిపోయింది. వైఎస్ ఫ్యామిలీకి అడ్డా అయిన కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఏపీ అధికారపక్షంలోకి మారనున్నారన్న వార్తలు వచ్చినా.. అధికారికంగా ప్రకటించింది లేదు. తాజాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాను పార్టీ మారుతున్న విషయాన్ని పలువురుతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

మిగిలిన వారి మాదిరి కాకుండా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే.. తాను పార్టీ మారుతానని చెప్పినట్లుగా చెబుతున్నారు. తాను పార్టీ మారే విషయాన్ని పార్టీ కార్యకర్తలు.. నియోజకవర్గ ముఖ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు అన్నట్లు తెలుస్తోంది. ఈ మాటలే నిజమైన పక్షంలో పండగపూట జగన్ కు ప్రశాంతత మిస్ అయినట్లే.