Begin typing your search above and press return to search.

జగన్ ఆస్తి లక్ష కోట్లు కాదు.. రూ.6లక్షల కోట్లా?

By:  Tupaki Desk   |   1 March 2016 4:33 AM GMT
జగన్ ఆస్తి లక్ష కోట్లు కాదు.. రూ.6లక్షల కోట్లా?
X
ఎక్కడ.. ఏ విషయంలో అయినా సరే.. రూ.లక్ష కోట్ల మాట విన్న వెంటనే తెలుగు ప్రజలకు తొలుత గుర్తుకు వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగనే. లక్ష కోట్ల మాటకు జగన్ కు ఉన్న అవినాభావ సంబంధం అందరికి ఎరుకే. నిజానికి జగన్ కు లక్ష కోట్ల రూపాయిలు ఆస్తిపాస్తులు ఉన్నాయా? లేవా? అన్న లెక్కను అధికారికంగా నిరూపించింది లేదు. కానీ.. కర్ణుడికి కవచకుండలాల మాదిరి.. జగన్ కు లక్ష కోట్ల ఆస్తి అన్న మాట అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది.

లక్ష కోట్ల మరకను తుడుపుకోవటానికి జగన్ బాబు కిందామీదా పడుతుంటే.. ఇటీవలే జగన్ పార్టీని వదిలేసి.. సైకిల్ ఎక్కేసిన కడప జిల్లా జమ్మల మడుగు మ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి షాక్ ను ఇస్తున్నాయి. జగన్ అక్రమ ఆస్తుల విలువ అందరూ అనుకున్నట్లు రూ.లక్ష కోట్లు కాదని.. వాటి విలువ ఏకంగా రూ.6లక్షల కోట్లు ఉంటాయని ఆది చెప్పుకొచ్చారు.

జగన్ జిల్లాకు చెందిన ఆది.. జగన్ అవినీతి చిట్టా మొత్తాన్ని విప్పుతానని వ్యాఖ్యానించటం తాజా కలకలంగా మారింది. ఇంతకీ లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పే జగన్ ఆసక్తి రూ.6లక్షల కోట్లు ఎలా సాధ్యమన్న మాటకు ఆది చెప్పే మాట వింటే కాస్త సిత్రంగా అనిపించక మానదు. ఉందో లేదో తెలీని లక్ష కోట్లకు.. రూపాయి చొప్పున వడ్డీ వేసుకున్నా.. ఇప్పటికి ఆ ఆస్తి మొత్తం రూ.6లక్షల కోట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. అంటే.. జగన్ కు లక్ష కోట్ల ఆస్తిని వైఎస్ హయాంలోనే కూడబెట్టి ఉంటే.. జగన్ ఆస్తులు రూ.6లక్షల కోట్లన్న మాట సరిపోతుందన్న మాట. ఏమైనా నిన్నటి వరకూ జగన్ పార్టీలో ఉండి వచ్చిన ఆది లాంటి నేత చెప్పే మాటలు విపక్ష నేత ఇమేజ్ ను ఎంతోకొంత డ్యామేజ్ చేయం ఖాయమనే చెప్పాలి.