Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతులను మించిన అదానీ సంపద

By:  Tupaki Desk   |   12 March 2021 5:30 PM GMT
ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతులను మించిన అదానీ సంపద
X
భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మరో అరుదైన రికార్డును సాధించాడు. ఆయన సంపాదన రాకెట్ లా దూసుకుపోయింది. 2021లో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరులైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ లను మించి అదానీ ఆదాయాన్ని ఆర్జించారని తాజాగా బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ తెలిపింది. ఈ ఏడాదిలో అత్యంత ఆదాయాన్ని ఆర్జించిన ప్రపంచ కుబేరులందరినీ అదానీ వెనక్కి నెట్టడం విశేషం.

2021లో అతి ఎక్కువ సంపాదన కలిగిన వ్యక్తిగా అదానీ నిలిచారు. ఆయన గ్రూపునకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్ మస్క్, బెజోస్ కంటే అదానీ ఈ విషయంలో ముందుడడం విశేషం.

అదానీ నికరఆస్తి 16.2 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ 2021లో 50 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.

భారత్ కు చెందిన మరో కుబేరుడు.. ఆసియాలోనే అత్యంత సంపాదనపరుడైన ముకేష్ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. అదానీ గ్రూపునకు చెందినషేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ 50శాతం మేర దూసుకెళ్లడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది.

అదానీకి పోర్టులు, ఎయిర్ పోర్టులు, కోల్ మైన్స్, పవర్ ప్లాంట్లు వంటి వివిధ వ్యాపారాలున్నాయి.