Begin typing your search above and press return to search.

ఆ పేపర్లో కథనం అదానీ సంపద గంటలో రూ. 73 వేల కోట్లు ఆవిరైంది!

By:  Tupaki Desk   |   14 Jun 2021 11:24 AM GMT
ఆ పేపర్లో కథనం అదానీ సంపద గంటలో రూ. 73 వేల కోట్లు ఆవిరైంది!
X
మీడియాను డామినేట్ చేస్తూ సోషల్ మీడియా వచ్చినా.. మీడియాకు ఉండే ప్రాధాన్యత.. అందులో ప్రచురితమయ్యే కథనాలకు ఉండే విలువ.. ప్రభావం ఎంతన్నవిషయం మరోసారి నిరూపితమైంది. ఈ రోజు (సోమవారం) స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలైన వెంటనే.. ఆదానీ షేర్లు ఒక్కొక్కటిగా కుప్పకూలాయి. మొన్నటి వరకు ఆల్ టైం రికార్డు ధరలకుపలికి.. ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న షేర్లకు కళ్లాలు పడ్డాయి.

అంతేకాదు.. మొన్నటి వరకు తిరుగులేదనుకున్న షేర్లు ఒక్కొక్కటిగా నేల చూడటం మొదలైంది. దీంతో.. ఆదానీ సంపద దాదాపు 7.6 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో రూ.73 వేల కోట్ల మేర ఆవిరి అయ్యింది. ట్రేడింగ్ మొదలైన గంటలోనే షేర్లు అన్ని లోయర్ సర్క్యుట్ ను తాకాయి. దాంతో వేలాది కోట్లు కనిపించకుండా పోయాయి. ఇంతకీ ఇలాంటి పరిస్థితికి కారణం.. ప్రముఖ టైమ్స్ గ్రూపుకు చెందిన ది ఎకనామిక్స్ టైమ్స్ లో ఆదానీ సంస్థలకు సంబంధించిన ఒక కథనాన్ని ప్రముఖంగా అచ్చేశారు.

అందులో పేర్కొన్న అంశం ఏమంటే.. ఆదానీ గ్రూపు కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాల్ని నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ షాకిచ్చిందని.. ఆదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టిన మూడు విదేశీ ఖాతాల్ని స్తంభింపజేసినట్లుగా పేర్కొంది. ఈ కథనం ఆదానీ షేర్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపటంతో పాటు.. నికరసంపదన మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆదానీకి చెందిన నాలుగు కంపెనీలకు విదేశీ సంస్థలకు (అల్బులా ఇన్వెస్ట్ మెంట్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మే 31కు ముందే ఈ ఖాతాల్ని ఫ్రీజ్ చేసినట్లుగా పేర్కొంది.

దారుణంగా ఆదానీ షేర్ల ధరలు పడిపోవటంతో ఆదానీ పోర్ట్స్.. ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ టోటల్ గ్యాస్.. ఆదానీ పవర్.. ఆదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు పతనమయ్యాయి. దీంతో.. వీటి ట్రేడింగ్ ను కాసేపు నిలిపివేయటం గమనార్హం. మొత్తంగా ఆదానీ షేర్లకు ఇవాళ మర్చిపోలేని బ్లాక్ మండేగా చెప్పక తప్పదు.