Begin typing your search above and press return to search.
సమస్యల్లో ఉన్న తెలుగోడి కోట మీద అదానీ కన్ను
By: Tupaki Desk | 25 Aug 2020 3:00 PM ISTసమస్యల్ని తమకు అవకాశంగా మార్చుకుంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పనే చేస్తోంది అదానీ సంస్థ. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ సంస్థ సుడి తిరిగిపోయిందని.. దాని నిర్ణయాలకు ఎదురే లేకుండా పోయిందన్న మాట కార్పొరేట్ ప్రపంచంలో వినిపిస్తూ ఉంటుంది. మిగిలిన సంస్థలకు భిన్నంగా ఆ సంస్థ కోరుకున్నదేదైనా సరే.. సొంతం కావాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతారు. దీనికి తగ్గట్లే.. మౌలిక సదుపాయాల విషయంలో ఆ కంపెనీకి తిరుగులేని రీతిలో దూసుకెళుతోంది.
లాభాల్లో ఉన్న విమానాశ్రయాల నిర్వహణను తన సొంతం చేసుకుంటున్న అదానీ ఖాతాలోకి ముంబయి ఎయిర్ పోర్టు కూడా చేరనున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఎయిర్ పోర్టు నిర్వహణ తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీకే గ్రూపు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో భారీ రుణభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జీవీకే.. ముంబయి ఎయిర్ పోర్టు ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
ఎందుకంటే.. అందులో మెజార్టీ వాటాల్ని కొనుగోలు చేసేందుకు అదానీ ముందుకు రావటమే కారణం. ముంబయి ఎయిర్ పోర్టు ప్రాజెక్టులో జీవీకే గ్రూపునకు 50.5 శాతం వాటాతో పాటు మైనార్టీ భాగస్వాములైన ఎయిర్ పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికా.. బిడ్ వెస్ట్ గ్రూప్ నుంచి మరో 23.5 శాతం వాటాల్ని అదానీ గ్రూపు కొనుగోలు చేయనుంది. దీంతో.. మెజార్టీ వాటా వారి సొంతం కావటంతో.. ముంబయి ఎయిర్ పోర్టు అదానీ పరం కానున్నట్లు చెబుతున్నారు.
నిజానికి ముంబయి ఎయిర్ పోర్టును సొంతం చేసుకోవటానికి అదానీ గ్రూపు గత ఏడాది నుంచి కసరత్తు చేస్తూనే ఉంది. ముంబయి ఎయిర్ పోర్టుకు సంబంధించి జీవీకే తర్వాత అత్యధిక వాటాలు బిడ్ వెస్టుకు 13.5 శాతం.. ఎయిర్ పోర్టు ఆఫ్ సౌతాఫ్రికాకు 10 శాతం.. ఎయిర్ పోర్టస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటాలు ఉన్నాయి. బిడ్ వెస్టు వాటాల్ని అదానీ గ్రూపు గత ఏడాది రూ.1248 కోట్లకు కొనుగోలు చేయాలని భావించింది. అయితే.. వాటాల్ని ఆ సంస్థ అమ్మే పక్షంలో తొలుత తమకే అమ్మాల్సి ఉంటుందని జీవీకే చెప్పి సేల్ కు అడ్డుకుంది. అయితే.. బిడ్ వెస్ట్ వాటాను కొనుగోలు చేసే స్థాయిలో నిధుల్ని సమకూర్చుకో లేకపోయింది.
దీంతో.. వివాదం కోర్టుకు చేరుకుంది. విచిత్రమైన అంశం ఏమంటే.. మొన్నటి వరకూ బిడ్ వెస్ట్ వాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన జీవీకే.. ఇవాల్టి రోజున తన వాటానే అమ్మకానికి పెట్టాల్సిన రావటం గమనార్హం. రుణ భారం అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో జీవీకే ఎయిర్ పోర్టు హోల్డింగ్స్ లో 79 శాతం వాటాల్సి అమ్మేందుకు పలు సంస్థలతో ఒప్పందం కుదర్చుకుంది. వీటి డీల్ విలువ రూ.7614 కోట్లు. ఈ డీల్ పూర్తి అయితే.. తన రుణభారాన్ని తగ్గించుకోవాలని భావించింది. అయితే.. ఇప్పటివరకు ఈ డీల్ ఏమైందన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. తాజాగా అదానీ గ్రూప్ తెర మీదకు వచ్చి.. జీవీకే వాటాల్ని కొనే విషయంలో ప్రదర్శిస్తున్న ఉత్సాహం కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.