Begin typing your search above and press return to search.

అంబానీని వెనక్కి నెట్టి.. అదానీ నంబర్ 1.. ప్రపంచంలోనే టాప్ 5 కుబేరుడు..

By:  Tupaki Desk   |   25 April 2022 3:53 PM GMT
అంబానీని వెనక్కి నెట్టి.. అదానీ నంబర్ 1.. ప్రపంచంలోనే టాప్ 5 కుబేరుడు..
X
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వచ్చాక కార్పొరేట్లు లాభపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అందునా ప్రధాని మోడీ రాష్ట్రానికి చెందిన అంబానీలు, అదానీలు ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ఎదిగారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు.అంబానీ, అదానీ.. ఈ ఇద్దరు గుజరాతీలు దేశ వ్యాపార రంగాన్ని అన్ని రంగాల్లో దున్నేస్తున్నారు. ఆసియాలోనే కుబేరులుగా ఎదిగారు. గుజరాత్ కే చెందిన మోడీ దేశంలో అధికారంలో ఉండడం.. వీరితో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉండడంతో వీరి వ్యాపారాలు ఆశాజనకంగా దూసుకెళ్తున్నాయని ఆరోపణలున్నాయి..

ప్రస్తుతం దేశంలోనే సంపన్నులు అంబానీ, అదానీ. ఇద్దరూ ఎప్పుడూ మార్కెట్ ను పసిగడుతూ వ్యాపారాలను విస్తరించి విజయాలు సాధించారు.ఇప్పుడు పరస్పరం పోటీపడుతున్నారు. నంబర్ 1 ర్యాంకు లక్ష్యంగా సాగుతున్న వీరి వ్యాపార ఫైట్ లో తాజాగా అదానీ దూసుకొచ్చాడు.. తాజాగా కుబేరుల జాబితా అదానీ భారతదేశంలో మొదటిస్థానంలో నిలిచారు.ఇక ఆసియాలోనూ నంబర్ 1గా నిలిచాడు. ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టి ఏకంగా 5 వస్థానంలోకి దూసుకొచ్చాడు.

గౌతం అదానీ మళ్లీ ఇండియా కుబేరుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన సంపద అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా అదానీ 123.7 బిలియన్ డాలర్ల సంపదతో మరోసారి ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితాలో ప్రపంచంలోనే టాప్ 5వ స్తానాన్ని దక్కించుకున్నాడు.

అదానీ వ్యాపారాలు కరోనా టైంలో దూసుకెళుతున్నాయి. ఒక్క 2022లోనే ఆయన సంపద 43 బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తంగా అదానీ సంపద ఈ ఏడాదిలో 56 శాతం పెరిగింది.

ఇక భారత్ తోపాటు ఆసియాలోనే కుబేరుడిగా మొదటి స్థానంలో కొనసాగిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి తొలిసారి ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతం అదానీ టాప్ 5లోకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఎలన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో.. బెర్నాల్డ్ అర్నాల్డ్ 167.9 బిలియన్ డాలర్లతో మూడో స్తానంలో.. బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో ఉన్నారు.

గౌతం అదానీ మాత్రం పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టులు, మౌళిక సదుపాయాల రంగంలో వ్యాపారం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే అంబానీని దాటేసి నంబర్ 1 స్థానానికి చేరారు.