Begin typing your search above and press return to search.

నటి మీద సొంత పార్టీ వాళ్లే చెప్పులేశారు

By:  Tupaki Desk   |   30 April 2016 10:51 AM IST
నటి మీద సొంత పార్టీ వాళ్లే చెప్పులేశారు
X
తమిళనాడు ఎన్నికల్లో అధికారపార్టీ తరఫున ప్రచారం చేస్తున్న నటి వింద్యకు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు అధికారపక్షం తరఫున బరిలోకి దిగిన నేతల తరఫున ప్రచారం చేస్తున్న నటి వింద్య తన ప్రచారంలో భాగంగా మంత్రి కామరాజ్ కు మద్దుతుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె నన్నిలం బస్టాండ్ సమీపానికి ప్రచారానికి వచ్చారు.

అమ్మగారు ప్రచారానికి వచ్చేసరికి టైం రాత్రి 9.55 గంటలు కావటం.. పది దాటితే నిబంధనలకు విరుద్దంగా ప్రచారం చేసినట్లు అవుతుందన్న ఉద్దేశంతో తాను ప్రసంగించనని తేల్చి చెప్పారు. దీంతో.. అప్పటివరకూ అమ్మడు చెప్పే మాటల కోసం ఆశగా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకు కోపం నశాళానికి అంటింది. తాము ఓపిగ్గా ఎదురుచూస్తుంటే.. తీరుబడిగా వచ్చి ఏమీ మాట్లాడనని చెప్పటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నటి వింద్యపై తిట్ల దండకాన్ని ఎత్తుకోవటమే కాదు.. మరికొందరు చెప్పులు విసిరారు. ఈ ఉదంతాన్ని మీడియా రికార్డు చేసే ప్రయత్నం చేయటంతో.. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రచారానికి వస్తే.. ఊహించనిరీతిలో చేదు అనుభవం ఎదురుకావటంతో నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. తనకు ఎదురైన చేదు అనుభవంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లుగా చెబుతున్నారు. అభిమానుల్ని అలరిస్తే నెత్తినపెట్టుకున్నట్లు.. వారిని నిరాశకు గురి చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది గుర్తించి.. జాగ్రత్తగా మెసులుకుటే మంచిదన్న విషయాన్ని వింధ్య ఇప్పటికైనా గుర్తిస్తే బెటర్ అన్న మాటలు వినిపిస్తున్నాయి.