Begin typing your search above and press return to search.
రోజాపై పోటీకి సై అంటున్న వాణీ విశ్వనాథ్!
By: Tupaki Desk | 29 Aug 2017 6:45 PM ISTఒకప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోని టాప్ హీరోలతో నటించిన హీరోయిన్ వాణీ విశ్వనాథ్. అప్పట్లో కొన్నియాక్షన్ సినిమాల్లో, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించిన ఆమెకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రంలో ఓ పాత్రలో నటించారు. ఈ చిత్రం తర్వాత ఆమె టాలీవుడ్ లో మరిన్ని సినిమాల్లో నటిస్తారని అందరూ భావించారు. తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా వాణీ విశ్వనాథ్ త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్నరని ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు.
వాణీ విశ్వనాథ్ రాబోయే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, తెలుగువారి రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి రాబోతున్నానని ఆమె చెప్పారు. తాను టీడీపీలో చేరబోతున్నట్లు కూడా ఇం డైరెక్ట్ గా చెప్పేశారు. తనకు ఏపీ సీఎం చంద్రబాబు అంటే చాలా ఇష్టమని, రాజకీయాల్లో ఆయన ఓ రోల్ మోడల్ అని ఆమె అన్నారు. మరో అడుగు ముందుకు వేసిన వాణీ విశ్వనాథ్ రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయదల్చుకున్న నియోజక వర్గంపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఒకవేళ తనకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ వస్తే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీ చేస్తానని చెప్పారు. ఒకవేళ వాణీ విశ్వనాథ్ కు టీడీపీ నుంచి ఆహ్వానం అంది నిజంగా ఆమె నగరిలో పోటీ చేస్తే అలనాటి ఇద్దరు టాప్ హీరోయిన్ల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.