Begin typing your search above and press return to search.

నువ్వే  నిజమైన రేపిస్టువి ... మాధవీలత హాట్ కామెంట్స్ !

By:  Tupaki Desk   |   3 Dec 2019 7:47 AM GMT
నువ్వే  నిజమైన రేపిస్టువి ... మాధవీలత హాట్ కామెంట్స్ !
X
వెటర్నరీ డాక్టర్ దిశాని నలుగురు కామాంధులు , అత్యంత క్రూరంగా అఘాయిత్యం చేసి , హత్య చేసి , పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణమైన ఘటనపై ..దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. డాక్టర్ దిశా పై అఘాయిత్యం చేసిన ఆ నలుగురికి ఉరి శిక్ష వేయాలని ప్రతి ఒక్కరు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే వ్యవహారం పై నిన్న పార్లమెంట్ కూడా షేక్ అయ్యింది. ఈ దిశా ఉదంతం పై తాజాగా హీరోయిన్ మాధవీలత కూడా స్పదించింది.

ఈ ఉదంతం పై సీఎం కేసీఆర్ ని సోషల్ మీడియాలో నిలదీస్తే .. ఓ నెటిజన్ నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ఆ నెటిజన్ చేసిన కామెంట్ తనను చాలా బాధించిందన్నారు. రేపిస్టులు ఎలా ఉంటారో ఫస్ట్ టైమ్ కళ్లారా చూశాను అని కామెంట్ చేసినట్టు తెలిపింది. పూర్తి వివరాలు చూస్తే .. దిశ ఘటనలో సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తూ తాను ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాను అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే.. మీరు ఎందుకు స్పందించడం లేదు. నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదు. ఇంకా ఎన్నాళ్లు టైమ్ తీసుకుంటారు, పట్టుకున్నా శిక్షలు వేయరా. మీ ఇంటి ఆడపిల్లకు ఇలా జరిగితేనే రెస్పాండ్ అవుతారా. బయటివాళ్లు మీకు ఆడపిల్లలా కనిపించడం లేదా? ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అని ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాను అని మాధవీలత చెప్పారు. దీనికి చాలామంది కామెంట్లు చేశారని , కానీ , ఒకడు మాత్రం చాలా దారుణంగా కామెంట్ పెట్టాడని తెలిపింది.

ఇంతకీ ఆ నెటిజన్ ఏమని కామెంట్ చేసాడంటే ... 'ఏందే నీ గోల. నీ లాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు' అని చేసాడు. దానికి మాధవీలత కూడా కొంచెం ఘాటుగానే బదులు ఇచ్చింది. '' రేపిస్టులు అంటే అలానో ఇలానో ఉంటారు అని టీవీలో చూశాను, పేపరల్లో చదివాను.. కానీ రేపిస్టులు అంటే నీలా ఉంటారు అని ఫస్ట్ టైమ్ నా ఫేస్ బుక్ లో చూశాను.. నీ సంస్కారం ఏంటో, నీ తల్లిదండ్రలు నిన్ను ఎంత గొప్పగా పెంచారో.. నీ కామెంట్ చూస్తేనే అర్థమవుతుంది'' అని ఆ వ్యక్తికి రిప్లయ్ ఇచ్చింది. అసలు నేను పెట్టిన పోస్టు ఏంటి.. నెటిజన్ చేసిన కామెంట్ ఏంటి? అని , ఇలాంటి వారు ఈ సమాజంలో ఉన్నన్ని రోజులు ఆడవారికి రక్షణ ఉండదు అని మాధవీలత చెప్పింది.