Begin typing your search above and press return to search.

సత్యవాణి : తెలుగుదేశం లోగుట్టు బయటపెడతా...

By:  Tupaki Desk   |   8 Jun 2022 8:00 AM IST
సత్యవాణి : తెలుగుదేశం లోగుట్టు బయటపెడతా...
X
తెలుగుదేశం పార్టీకి తాజాగా రాజీనామా చేసి బయటకు వచ్చిన సినీ నటి, మహిళా నాయకురాలు దివ్యవాణి తాజాగా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. టీడీపీలో తాను ఇన్నాళ్ళు ఉన్నపుడు చూసినది విన్నది  అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా బయటపెడతాను అని చెప్పుకొచ్చారు.

టీడీపీ లోపల అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో అన్నీ చెబుతా అసలు గుట్టు బయటేస్తాను అని కూడా స్పష్టం చేస్తున్నారు. నేను చెప్పే ప్రతీ మాటకూ ఆధారాలు ఉన్నాయి. నేను చెప్పే వాటిని చూపించే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా అని దివ్యవాణి సవాల్ విసిరారు.

టీడీపీలో ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు అని ఆమె అంటున్నారు. అక్కడ తన లాంటి వారితో సహా ఎవరికీ పనిచేసుకునే స్వేచ్చ లేదు అని కూడా ఆరోపించారు. ఇక టీడీపీలో విశ్లేషకుల పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆమె ఆరోపిస్తున్నారు.

నేను టీడీపీ లోపలి కధను నిర్భయంగా నిజాలు మాత్రమే చెబుతాను, మరి వాటిని చూపించే డేరింగ్ ఎల్లో మీడియాకు ఉందా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. సాధ్యమైనంత తొందరలో నిజాలను తాను బయటపెట్టబోతున్నట్లుగా ఆమె చెప్పడం విశేషం. మరి ఆమె సవాళ్ళకు జవాబు ఎవరు చెబుతారు, ఇంతకీ ఆమె ఏమి బయటపెట్టబోతున్నారు. టీడీపీ లోగుట్టు ఏమిటి. అక్కడ ఏమి జరుగుతోంది అని దివ్యవాణి భావిస్తున్నారు ఇవన్నీ ఆసక్తిని పెంచే విషయాలు. మరి సత్యమైన వాక్కు తో దివ్యమైన వాణిని వినిపిస్తాను అంటున్న దివ్యవాణి ఏం చెబుతారో వేచి చూడాల్సిందే.