Begin typing your search above and press return to search.
తన పేరును, ఫొటోను రాజకీయాల్లో దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు : స్టార్ హీరో
By: Tupaki Desk | 6 Nov 2020 12:20 PM ISTతమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తరువాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. జయలలిత కూడా సినీ పరిశ్రమలో హీరోయిన్ గా వెలుగు వెలిగి రాజకీయాల్లో సీఎంగా చరిత్ర సృష్టించారు. దీంతో లేని లోటును భర్తీ చేయాలని ప్రస్తుతం తమిళ హీరోలు ప్రయత్నిస్తున్నారు. వరుసగా రాజకీయాల్లోకి వస్తున్నారు.. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ ఇప్పటికే ఈ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై వారు కన్నేశారు.
రజినీకాంత్.. కమల్ తరువాత.. రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు హీరో దళపతి విజయ్. అతని అభిమానులు ఆయనను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ విజయ్ అభిమానుల అభ్యర్థనలను అంగీకరించడం లేదా తిరస్కరించడం లేదు. అతను రాజకీయాలపై మౌనం పాటిస్తున్నాడు.
విజయ్ తండ్రి ఎస్.ఐ.చంద్రశేఖరన్ ఇటీవల మాట్లాడుతూ దళపతి విజయ్ పేరుతో పార్టీని రిజిస్టర్ చేశామని.., హీరో విజయ్ కి దాని గురించి తెలియదు అని క్లారిటీ ఇచ్చారు. “ఇది విజయ్ రాజకీయ పార్టీ కాదు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా లేదా అనేది నేను వ్యాఖ్యానించలేను ”అని ఎస్‌ఐ చంద్రశేఖరన్ అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కథలో ఇది పెద్ద మలుపుగా మారింది.
విజయ్ అభిమానుల్లో దీనిపై పెద్ద దుమారం, గందరగోళం చెలరేగింది. ఈ వార్తలపై ఎట్టకేలకు అధికారికంగా విజయ్ స్పందించారు.
తాను ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించలేదని.. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పార్టీని పెట్టారని.. దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో విజయ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో తన పాత్ర.. తన అభిమాన సంఘాల పాత్ర ఉండదని తెలిపారు. అలాగే పార్టీ తన తండ్రిది కాబట్టి అభిమానులను వెళ్లి అందులో చేరమని తాను చెప్పనని.. ఒకవేళ తన పేరును, ఫొటోను రాజకీయాల్లో దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచించనని విజయ్ హెచ్చరించారు.