Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్ సూసైడ్.. చివరి కోరిక అదేనట!
By: Tupaki Desk | 4 Sept 2018 1:50 PM ISTజనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని ఒకరు తాజాగా ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది. తీవ్రమైన నిస్పృహలో ఉన్న అతని అభిమాని కొమరవల్లి అనిల్ కుమార్ సోమవారం సూసైడ్ చేసుకున్నారు. విజయవాడలోని ఒక జిమ్ లో ట్రైనర్ గా వ్యవహరిస్తున్న అతగాడు కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
ఆత్మహత్యకు ముందు పవన్ పేరుతో ఒక లేఖను రాశారు. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ అని.. తాను చనిపోయిన తర్వాత తనను చూసేందుకు రావాలని తన ఆఖరి లేఖలో పేర్కొన్నారు. తన అంత్యక్రియలు పవన్ చేతుల మీద జరగాలన్నదే తన చివరి కోరికగా పేర్కొన్నారు.
తనను చూసేందుకు పవన్ స్వయంగా వస్తారని ఆశిస్తున్నట్లుగా సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. ఇలాంటి అభిమానుల కోర్కెల్ని పవన్ తీరుస్తారా? వాటిని సీరియస్ గా పట్టించుకుంటారా?