Begin typing your search above and press return to search.

శివాజీని సైబ‌రాబాద్ పోలీసులు ఏం చేయ‌నున్నారు?

By:  Tupaki Desk   |   3 July 2019 7:18 AM GMT
శివాజీని సైబ‌రాబాద్ పోలీసులు ఏం చేయ‌నున్నారు?
X
టీవీ9 కొనుగోలు విష‌యంలో అలందా మీడియా చేసిన ఫిర్యాదు నేప‌థ్యంలో సినీ న‌టుడు క‌మ్ గ‌రుడు పురాణం బ్ర‌ద‌ర్ గా ఫేమ‌స్ అయిన శివాజీ పేరు చేర‌టం.. సైబ‌రాబాద్ పోలీసులు ఆయ‌న‌కు ప‌లుమార్లు నోటీసులు ఇవ్వ‌టం తెలిసిందే. త‌న మీద సైబ‌రాబాద్ పోలీసులు చేసిన ఆరోప‌ణ‌ల‌కుఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానం ఇవ్వ‌ని శివాజీ.. కోర్టులో మాత్రం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా స్టే ఇవ్వాల‌ని కోరారు.

ఇదిలా ఉంటే.. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇదే స‌మ‌యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాల‌కు వెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్న శివాజీని సైబ‌రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే..కొన్ని ఛాన‌ళ్లు.. మీడియా సంస్థ‌ల రిపోర్టుల‌లో మాత్రం అరెస్ట్ చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. శివాజీని తాము అరెస్ట్ చేయ‌లేద‌ని.. కేవ‌లం అదుపులోకి మాత్ర‌మే తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

శివాజీకి జారీ చేసిన నోటీసుల ప్ర‌కారం ఆయ‌న్ను అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. తామిచ్చిన నోటీసుల మేర విచార‌ణ జ‌రిపి.. ఆయ‌న్ను విడిచిపెడ‌తార‌ని చెబుత‌న్నారు. కాకుంటే.. విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని చెప్పే అవకాశం ఉందంటున్నారు.ఈ ఇష్యూ పూర్తి అయ్యే వ‌ర‌కూ ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ల మీద ఆంక్ష‌లు పెట్టే అవ‌కాశం ఉంద‌న్న‌మాట వినిపిస్తోంది.

తాజాగా అందుతున్న స‌మాచారం ప్రకారం శివాజీ పాస్ట్ పోర్ట్ ను సైబ‌రాబాద్ పోలీసులు సీజ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో ఇచ్చిన లుకౌట్ నోటీసుల ఆధారంగా శివాజీ విమానాశ్ర‌యంలో ఉన్న స‌మాచారాన్ని అందుకున్న సైబ‌రాబాద్ పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ప‌లువురు చెబుతున్న‌ట్లుగా శివాజీని అరెస్ట్ చేయ‌లేద‌ని.. కేవ‌లం అదుపులోకి మాత్ర‌మే తీసుకున్న‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. సో.. ఆయ‌న మ‌రికొద్ది గంట‌ల్లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌టం ఖాయ‌మ‌న్న మాటను చెబుతున్నారు. మ‌రి..పోలీసు వ‌ర్గాలు చెప్పిన‌ట్లే జ‌రుగుతుందా? లేదంటే ఏమైనా ట్విస్ట్ చోటుచేసుక‌నే అవ‌కాశం ఉందా? అన్న‌ది చూడాలి.