Begin typing your search above and press return to search.

ఆ న‌టుడికి జ‌గ‌న్ లో ఎవ‌రు క‌నిపించారంటే?

By:  Tupaki Desk   |   25 Dec 2018 5:31 AM GMT
ఆ న‌టుడికి జ‌గ‌న్ లో ఎవ‌రు క‌నిపించారంటే?
X
ఒక ప్ర‌ముఖ నాయకుడ్ని పొగ‌డ‌టం మామూలే. కానీ.. పొగ‌డ్తలా కాకుండా.. గుండె లోతుల్లో నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెప్పే మాట‌ల‌కు నిద‌ర్శ‌నంగా తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి ఒక సీనియ‌ర్ న‌టుడు చేసిన వ్యాఖ్య ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి.

ఒక‌ద‌శ‌లో టాలీవుడ్‌ లో అగ్ర హీరోల్లో ఒక‌రిగా అవ‌త‌రించే అవ‌కాశాన్ని పొందిన నాటి సీనియ‌ర్ న‌టుడు భానుచంద‌ర్ ఈ మ‌ధ్య‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌టం తెలిసిందే. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని.. జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని త‌పిస్తున్న‌ట్లు చెప్పారు. జ‌గ‌న్ లో ఎంతో ఓర్పు.. మ‌రెంతో ఔదార్యం క‌లిగిన నేత‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. జ‌గ‌న్ ను తాను చూసిన‌ప్పుడు త‌న‌కు బుద్ధుడి రూపం క‌ళ్ల ముందు క‌ద‌లాడిన‌ట్లుగా చెప్పారు. అందుకే.. తాను వైఎస్సార్ కాంగ్రెస్‌ లో చేరిన‌ట్లుగా వ్యాఖ్యానించారు. భానుచంద‌ర్ చేసిన వ్యాఖ్యపై జ‌గ‌న్ అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.