Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికల పై అచ్చెన్నాయుడు లేఖాస్త్రం

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:00 PM IST
స్థానిక ఎన్నికల పై అచ్చెన్నాయుడు లేఖాస్త్రం
X
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు. నిమ్మగడ్డ ఈ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపుతుంటే జగన్ సర్కార్ మాత్రం నో చెబుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల సంఘానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా లేఖ రాశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేకనే టీడీపీ అభ్యర్థులను బెదిరించే ప్రక్రియకు వైసీపీ దిగుతోందని అచ్చెన్నాయుడు లేఖలో విమర్శించారు. సంతమాగులూరు కుందూరులో వైసీపీ శ్రేణులు కత్తులతో టీడీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని.. కుందూరు ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్తపై హత్యాయత్నం చేశారని లేఖలో అచ్చెన్న పేర్కొన్నారు.

టీడీపీ అభ్యర్థులను టార్గెట్ చేసి వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు లేఖలో ఆరోపించారు. వైసీపీ నేతల విధ్వంసంపై సీబీఐ విచారణ జరపాలని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అచ్చెన్న లేఖలో ఈసీని కోరారు.

ఇక వైసీపీ దౌర్జన్యాల నేపథ్యంలో ఆన్ లైన్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలని ఈసీని అచ్చెన్నాయుడు కోరారు. దీనిపై ఈసీ దృష్టి సారించాలని లేఖలో విన్నవించారు.