Begin typing your search above and press return to search.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..! మౌనం వీడుతారా?
By: Tupaki Desk | 22 Sept 2020 6:30 PM ISTఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును ఖాయం చేశారని టీడీపీ వర్గాల నుంచి మీడియాకు సమాచారం అందింది. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు సమాచారం. ఈ నెల27న అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలిసింది.
ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. కళా వెంకట్రావ్ కూడా బీసీనే. అచ్చెన్న కూడా అదే వర్గం. సో బీసీల నుంచి బీసీలకు ఇచ్చినట్టు ఉంటుందని.. అలాగే జగన్ పై పోరాడుతూ జైలుకు వెళ్లిన అచ్చెన్నకు న్యాయం చేసినట్టు అవుతుందని చంద్రబాబు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఈ ప్రణాళిక వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టు సమాచారం. టీడీపీకి ఆది నుంచి బీసీలే బలం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓటు బ్యాంక్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. కానీ 2019 ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్ అంతా జగన్ వెంట నడిచింది. సో ఈసారి ఎలా అన్నా బీసీ ఓటు బ్యాంక్ పోకూడదు అని అచ్చెన్నాయుడికి ఈ అత్యున్నత పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది. బీసీ అయిన అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇష్తే బీసీ ఓటు బ్యాంకును ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవచ్చని బాబు ఈ ఆలోచన చేసినట్టు తెలిసింది.
ఇన్ సైడ్ సమాచారం ప్రకారం.. ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కొని జైలు నుంచి బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు సైలెంట్ అయ్యారు. తనను 70 రోజుల పాటు జైల్లో పెట్టిన జగన్ సర్కార్ ను ఒక్క మాట కూడా పల్లెత్తు అనడం లేదు. ఇక టీడీపీ రాజకీయాల్లోనూ యాక్టివ్ గా లేరు. గతంలో జగన్ పేరు చెబితేనే ఒంటి కాలిమీద లేచే అచ్చెన్నాయుడు..జైలుకు వెళ్లొచ్చాక సైలెంట్ అయ్యారు. తనను జైలుకు పంపిన జగన్‌ను టార్గెట్ చేయడం మానేశాడు. జగన్ మీద విమర్శలు చేయాలంటే టీడీపీ ఎప్పుడూ అచ్చెన్నాయుడినే ముందుకు వదులుతుంటుంది. నిండు సభలోనే ఆయన జగన్‌ను ఎన్నోసార్లు నిలదీశారు. ఎన్నో విధాలా విమర్శలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర్నుంచి.. అమరావతి ఆందోళనల వరకు తనకు సంబంధం లేని ప్రతి విషయాల్లో చంద్రబాబు.. ఏరికోరి అచ్చెన్నాయుడిని రంగంలోకి దింపారు. తీరా ఇప్పుడు కేసులు నెత్తిమీద పడ్డాక పూర్తిగా సైలెంట్ అయ్యారు.
ఒక రకంగా అచ్చెన్న ప్రస్తుతం పార్టీకి, చంద్రబాబుకి కూడా దూరంగా ఉంటున్నట్లే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడంతో బాబు వైఖరి మొత్తం ఆయనకు అర్థమైనట్లుగా తెలుస్తోంది. ఇతరుల కోసం తాము బలికావడం ఎందుకని ఈ డిస్టెన్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్యాయం జరిగిన భావన కలుగకుండా చంద్రబాబు ఈ అత్యున్నత పదవిని అచ్చెన్నకు కట్టబెట్టినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు ప్రస్తుతం ఎర్రనాయుడు ఫ్యామిలీ మీదనే ఆధారపడుతున్నాడని తెలుస్తోంది. అచ్చెన్నాయుడు జైల్లోంచి వచ్చాక టీడీపీలో ఆత్మనూన్యతకు లోను అవుతూ సైలెంట్ గా ఉండడంతో చంద్రబాబు ఈ పోస్టు కట్టబెట్టినట్టు సమాచారం.