Begin typing your search above and press return to search.

ESI స్కామ్ : తప్పు చేసినట్టు ఒప్పుకున్న అచ్చెన్నాయుడు

By:  Tupaki Desk   |   21 Feb 2020 12:30 PM GMT
ESI స్కామ్ : తప్పు చేసినట్టు ఒప్పుకున్న అచ్చెన్నాయుడు
X
తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ తరహాలో ఏపీలోను ఈఎస్‌ ఐ ఇన్సూరెన్స్ మెడికల్‌ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందని... ఇందులో ఈఎస్‌ ఐకి చెందిన ముగ్గురు మెడికల్ డైరెక్టర్లు రవికుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్‌ లు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ గుర్తించింది. ఆరేళ్లలో ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారని తేల్చడంతోపాటు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరించింది. .
తెలంగాణలో స్కామ్‌కు తెరలేపిన.. లెజెండ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, ఓమ్ని మెడీ, అవెంటర్‌ పర్ఫామెన్స్‌ సంస్థలే ఏపీలోను కుంభకోణానికి కారణమయ్యాయి.

అయితే , ఈ వ్యవహారం పై స్పందించిన అచ్చెన్నాయుడు ... మాట్లాడుతూ అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించిన విధంగానే తాము వ్యవహరించామని,అలాగే ఆ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే తాము కూడా వ్యవహరించామని అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే ,ఈ స్కామ్ విషయంలో అచ్చెన్నాయుడు స్పందించిన తీరుపై వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌ రెడ్డి తనదైన రీతిలో కామెంట్స్ చేసారు.

ఈఎస్‌ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కార్మికుల పొట్ట కొట్టిన అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని ఈఎస్ ఐ లో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనికి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన సొమ్మునంతా అవినీతి పరుల నుంచి రికవరీ చేయాలనీ కోరారు. తెలంగాణలో ఎలా కాంట్రాక్టు ఇచ్చారో ఇక్కడ కూడా ఏపీలో కూడా అలానే ఇచ్చామని అచ్చెన్నాయుడు అంటున్నారు. తెలంగాణలో తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా తప్పు జరిగినట్లు ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టే కదా అని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

మేము గతంలోనే చెప్పాం ఈఎస్ ఐ హాస్పిటల్స్‌లో అవినీతి జరుగుతోందని, ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ద్వారా అదే నిజమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ అవినీతికి కేరాఫ్‌ గా మారింది అని . మంత్రిగా అచ్చెన్నాయుడు ఒత్తిడి మేరకే మూడు కంపెనీలకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారు అని తెలిపారు.