Begin typing your search above and press return to search.
దిశా ఎన్‌కౌంటర్ నకిలీ అన్న ప్రధాన నిందితుడి తండ్రి
By: Tupaki Desk | 5 Sept 2021 5:00 AM ISTహైదరాబాద్‌లో జరిగిన దిశా ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడి తండ్రి తాజా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్ చేసినట్లు పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు నియమించిన విచారణ కమిషన్ ముందు శుక్రవారం ఆయన హాజరై ఈ విషయాన్ని వారికి తెలియజేశారు. దిశ కేసులో నిందితులైన పింజరి హుస్సేన్ ఈ మేరు విచారణ కమిషన్ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతని కుమారుడు ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అహ్మద్‌ను పోలీసులు తమ ఇంటి నుండి తీసుకువెళ్లారని, అయితే తుపాకీతో కాల్చి చంపారని పేర్కొన్నాడు.
పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన మిగిలిన ముగ్గురు నిందితుల బంధువులు సిర్పూర్కార్ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. జొల్లు శివుని తండ్రి రాజయ్య, చింతకుంట్ల చెన్నకేశవులు తండ్రి కూర్మన్న ,జోల్లు నవీన్ తల్లి లక్ష్మిలు హాజరు కావాల్సి ఉంది.
దిశా హత్య చారం కేసు నవంబరు 27, 2019న చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన యువ పశువైద్యురాలిపై అత్యాచారం.. హత్య చేసి నలుగురు నిందితులు దారుణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు నలుగురిని గుర్తించి అరెస్టు చేశారు.
అదే సంవత్సరం డిసెంబర్ 6న నలుగురు నిందితులను షాద్‌నగర్ సమీపంలోని క్రైమ్ స్పాట్‌లోనే ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులు తమ ఆయుధాలను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించారని ఇది హత్యకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మానవ హక్కుల కార్యకర్తలు దీనిపై విచారణ జరపాలని కోరారు. దీని తర్వాత హత్యలపై విచారణ జరిపేందుకు సిర్పూర్కార్ కమిషన్‌ని నియమించారు.