Begin typing your search above and press return to search.
నేను కాదు..మోడీయే టీడీపీలో చేరుతున్నారు!
By: Tupaki Desk | 18 Jan 2017 7:08 PM ISTతను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాననే ప్రచారంపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ ఘాటుగా రియాక్టయ్యారు. బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్న విశ్వాస్ - ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో సహిదాబాదు నుంచి పోటీ చేయనున్నారని జాతీయ మీడియాలో ఉధృతంగా సాగిన ప్రచారంపై సరదాతో కూడిన ట్వీట్ చేశారు. "విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇక దీనిని వార్త చేయండి. మీరు నన్ను పార్టీ మారుతున్నట్లు చేసిన ప్రచారం లాగే నేను కూడా జోక్ చేస్తున్నా" అంటూ మీడియాకు విశ్వాస్ అనూహ్య రిప్లై ఇచ్చారు.
ఈ సందర్భంగా మోడీ - బీజేపీ నేతలపై సైతం విశ్వాస్ మండిపడ్డారు. తాను బీజేపీలో చేరడం లేదని ఇలాంటి వార్తల్లో నిజం లేనే లేదని విశ్వాస్ తేల్చిచెప్పారు. అంతేకాకుండా బీజేపీ నేతలను హాస్య చతురత(సెన్సాఫ్ హ్యూమర్) పెంచుకోమంటే... పుకార్లు వ్యాపించడం(సెన్సాఫ్ రూమర్) తీరును తారాస్థాయికి చేరుతుస్తారని ఎద్దేవా చేశారు. ఆప్ అగ్రనేతలు మనీష్ సిసోడియా - కపిల్ మిశ్రా సైతం కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారనే వార్తలను కొట్టిపారేశారు. పుకార్లు పుట్టించారంటూ బీజేపీపై మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత అమిత్ షా ఆప్ లో చేరితే....రాహుల్ గాంధీ చేరనున్నారని జోస్యం చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/