Begin typing your search above and press return to search.

సీఎం జగన్ ను కలిసేందుకు వెళుతూ యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   4 Dec 2020 1:01 PM IST
సీఎం జగన్ ను కలిసేందుకు వెళుతూ యాక్సిడెంట్
X
కాసేపట్లో వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాల్సి ఉంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టు పరిశ్రమ సమస్యల్ని ముఖ్యమంత్రి ముందు పెట్టటంతో పాటు. తమ సమస్యల పరిష్కారానికి సాయం చేయాలని కోరాలనుకున్నారు. సీఎం జగన్ తో భేటీతో తమ సమస్యలకు అంతో ఇంతో పరిష్కారం లభించే అవకాశం ఉండటంతో వారెంతో సంతోషంగా ఉన్నారు.

వీరి ఆలోచనలు ఇలా ఉంటే.. విధి మరోలా వ్యవహరించింది.గుంటూరు జిల్లా చౌడవరం వద్ద హైవే మీద ఆగి ఉన్న హైవే భద్రతా వాహనాన్నిఢీ కొట్టింది. వేగంతో ఉన్న కారు.. ఎదురుగా ఉన్న వాహనాన్ని అంచనా వేయటంలో జరిగిన పొరపాటు.. భారీ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో హిందూపురం సిల్క్ రీలర్ల సంఘం అధ్యక్షుడు రియాద్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వాహనంలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు.

మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్నంతనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ జీజీహెచ్ కు చేరుకొని క్షతగాత్రుల్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వెళుతూ ప్రమాదానికి గురి కావటం బాధాకరమన్న ఆయన.. మెరుగైన వైద్యసేవల్ని అందించాలని వైద్యుల్ని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రమాదానికి గురైన కుటుంబాల వారికి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.