Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

By:  Tupaki Desk   |   13 Oct 2020 11:00 AM IST
వైసీపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
X
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కారుకి యాక్సిడెంట్ జరిగింది. సోమవారం రాత్రి నెల్లూరు జిల్లా నాయుడుపేట మల్లాం జంక్షన్ దగ్గర గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు.

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా.. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎమ్మెల్యే వరప్రసాద్ ను మరో కారులో పంపించారు. ఈ ప్రమాదంలో కారు కూడా ధ్వంసమైంది. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

2014 ఎన్నికల్లో వరప్రసాద్ తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కాగా ఇటీవల వైసీపీ ప్రజాప్రతినిధులు వరుసగా ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.