Begin typing your search above and press return to search.

జగన్ పార్టీ ఎమ్మెల్యే బర్త్ డే వెళ్లి వస్తుండగా ఆ ఇద్దరు మృతి

By:  Tupaki Desk   |   8 Nov 2020 6:30 PM IST
జగన్ పార్టీ ఎమ్మెల్యే బర్త్ డే వెళ్లి వస్తుండగా ఆ ఇద్దరు మృతి
X
కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకుల్నిఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో వెల్దుర్తికి చెందిన తొమ్మిదిమంది యువకులు ఉన్నారు. ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళుతున్నవేళ.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు కార్యకర్తల ప్రాణాలు పోవటంతీవ్ర విషాదాన్ని నింపింది.

ఎమ్మెల్యే వారి పుట్టినరోజు వేడుకల్నిఘనంగా నిర్వహించారు. దీనికి నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రమదానికి గురైన యువకులు వాహనంలో వెళుతుండగా.. వారికి ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చింది. దాన్ని తప్పించుకునే క్రమంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన వీరి వాహనం.. గుంతలో బోల్తా పడింది.

ఈ ఘటనలో చిక్కుకున్న తొమ్మిది మందిలో ఇద్దరు అక్కడికక్కడ మరణించినట్లు చెబుతున్నారు. మరణించిన వారిని 33 ఏళ్ల రాము.. 28 ఏళ్ల దేవంద్రలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి డేంజర్ గా ఉందంటున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. అతి వేగమే ఈప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని మాటిచ్చారు. ఆసుపత్రిలో ఉన్న వారి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. వేడుకలకు హాజరై తిరిగి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే... ఈ తరహా తప్పులకు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పక తప్పదు.