Begin typing your search above and press return to search.

బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం..

By:  Tupaki Desk   |   18 May 2022 4:49 AM GMT
బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం..
X
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం తప్పంది. హైదరాబాద్ లోని ఆయన ఇంటి గేట్ ను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో గేటు స్వల్పంగా ధ్వంసమైంది. అయితే బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం అనే వార్త సోషల్ మీడియాలో రాగానే తెగ వైరల్ అయింది. ఈ ప్రమాదంతో బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఏం జరిగిందో తెలియక అటు అభిమానులు, ఇటు నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ గేటును ఢీకొట్టింది ఆకతాయి కుర్రాళ్ల బైక్ లు కాదు.. ఓ అమ్మాయి నడుపుతున్న వాహనం. అసలేం జరిగిందంటే..?

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అటు రాజకీయాల్లో కొనసాగుతూ ఇటు సినిమాల్లో జోరుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన 'అఖండ' సక్సెస్ జోష్ లో ఉన్న బాలయ్య ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్నాడు.

ఈ క్రమంలో బాలకృష్ణ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండాల్సి వస్తోంది. హైదాబాద్లోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45లో బాలకృష్ణ ఇల్లు ఉంది. ఇది మెయిన్ రోడ్డుపై ఉండడంతో ఇటువైపు వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగుతాయి. రోడ్డు పెద్దదిగా ఉండడంతో మధ్యలో డివైడర్ కూడా కట్టారు.

ఓ యువతి తన వాహనాన్ని నడుపుకుంటూ ఇటువైపు వచ్చింది. అయితే ఒక్కసారి తన వాహనాన్ని బాలకృష్ణ ఇంటిగేటువైపు దూసుకెళ్లింది. దీంతో స్థానికులు అక్కడికి గుంపులుగా చేరారు. ఆ తరువాత పోలీసులు వచ్చాయి.

అసలు విషయం విచారించగా.. ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను తప్పించబోయి వాహనాన్ని డైవర్డ్ చేశానని యువతి చెప్పింది. ఈ క్రమంలో డివైడర్ పైకి ఎక్కడి బాలకృష్ణ ఇంటి గేటు వైపు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం కాలేదు. బాలకృష్ణ ఇంటి వద్ద కూడా ఎవరూ లేకపోవడం పెద్ద ఇబ్బందులు ఏర్పడలేదు.

కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది. బాలకృష్ణ ఇంటి వద్ద ప్రమాదం అని తెలియగానే అసలేం జరిగిందని నెట్లో తీవ్రంగా సెర్చ్ చేశారు. అయితే వాహనాన్ని యువతి నడపడం వల్ల లైట్ గా తీసుకున్నారని అంటున్నారు. అదే వేరే వ్యక్తి అయితే సమస్య పెద్దదిగా మారి ఉండేదని స్థానికులు అంటున్నారు. మరోవైపు బాలకృష్ణ ఓ రీమేక్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.