Begin typing your search above and press return to search.

షేక్‌ పేట్ లంచం కేసులో ఎమ్మార్వోనే కీల‌కం: బిగుస్తున్న ఉచ్చు

By:  Tupaki Desk   |   8 Jun 2020 11:10 AM GMT
షేక్‌ పేట్ లంచం కేసులో ఎమ్మార్వోనే కీల‌కం: బిగుస్తున్న ఉచ్చు
X
కోర్టులో ఉన్న భూ పంచాయితీని తాము ప‌రిష్క‌రిస్తాం.. భారీగా ఇచ్చుకోవాల‌ని ఓ వ్య‌క్తితో రెవెన్యూ అధికారులతో పాటు ఓ ఎస్ ఐ ఒప్పందం కుదుర్చుకున్న విష‌యం బ‌య‌ట‌కు పొక్కి వారు అరెస్ట‌య్యే దాక వ‌చ్చింది. భూములు కాపాడాల్సిన వారు.. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించాల్సిన వారు త‌ప్పుదోవ పట్టిన ఘ‌ట‌న తెలంగాణ‌లో శ‌నివారం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ షేక్‌ పేట్‌ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత కీల‌కంగా ఉన్నారు. అందుకే ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

ఆమెను అదుపులోకి తీసుకుని ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ క్ర‌మంలో ఆమె నివాసంలో సోదాలు చేయ‌గా రూ.30 లక్షల న‌గ‌దు - నగలు విషయంపై ఎమ్మార్వో సుజాతను ఆరా తీశారు. అయితే వాటికేవీ ఆధారాలు లేక‌పోవ‌డంతో ఈ వ్య‌వ‌హారంలోనివేన‌ని తెలుస్తోంది. అయితే ఆమె ఆ డబ్బులు త‌న జీత‌మ‌ని - బ్యాంకు నుంచి డ్రా చేశానని చెప్పినట్లు సమాచారం. అయితే బ్యాంక్‌ నుంచి డ్రా చేస్తే దానికి సంబంధించిన ర‌సీదులు చూపించాలని ఏసీబీ అధికారులు అడిగారు. దీంతో ఆమె నుంచి స్పంద‌న రాలేదు. ఆమె నివాసంలో సోదాలు చేసిన స‌మ‌యంలో మరికొన్ని భూములకు సంబంధించిన ప‌త్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై సోమవారం ఆమెను విచారిస్తున్న‌ట్లు తెలిసింది.

ఈ కేసులో రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుబ‌డిన ఆర్ఐ నాగార్జున రెడ్డి - బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ నాయక్‌ ను కూడా ఏసీబీ అధికారులు విచార‌ణ చేస్తున్నారు. వీరి ముగ్గురు ఎవ‌రెవ‌రితో ఫోన్‌ల‌లో మాట్లాడారో ఆ వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారి కాల్ డేటా తెప్పించుకుంటున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీఓ వసంతకుమారిని అధికారులు విచారించిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆర్ఐ నాగార్జున రెడ్డి - ఎస్సై రవీందర్ నాయక్ - ఎమ్మార్వో సుజాతలను సుదీర్ఘంగా అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముగ్గురి‌ స్టేట్‌ మెంట్లను రికార్డు చేశారు. ఆర్ ఐ నాగార్జున రెడ్డి - ఎస్సై రవీందర్ నాయక్‌ను రిమాండ్‌ కు తరలించారు. ఈ కేసులో ఎమ్మార్వో ప్ర‌ధాన నిందితురాలు. కాక‌పోతే ఆమెకు సంబంధించిన పాత్ర‌పై రుజువులు ల‌భించ‌డం లేదు. ఒక్క సాక్ష్యం ల‌భిస్తే ఆమెను కూడా క‌ట‌క‌టాల్లోకి పంపే అవ‌కాశం ఉంది.